తెలుగు ఇండస్ట్రీలో నాగార్జునకు ఎంత క్రేజ్ ఉందో మనందరికి తెలిసిన విషయమే. అక్కినేని ఫ్యామిలీ నుండి తన తండ్రి తరువాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నాగార్జున. ఇక వీరికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉండటంతో వీరు తీసే ఫ్యామిలీ క‌థా చిత్రాల‌కు తిరుగులేని క్రేజ్ ఉండేది. అయితే ఈ తండ్రి కొడుకులు కొత్త టాలెంట్‌ను, కొత్తవారిని ఎప్పుడు అయినా స‌రే ప్రోత్సహించడానికి  ముందంజలో ఉంటారు. అప్ప‌ట్లో ఏఎన్నార్‌.. ఆ త‌ర్వాత నాగార్జున ఎంతో మంది కొత్త ద‌ర్శ‌కులు, కొత్త త‌రం టెక్నీషియ‌న్ల‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారు.

భార‌త దేశం గ‌ర్వించ ద‌గ్గ ద‌ర్శ‌కుల‌లో ఒక‌రు అయిన రాంగోపాల్ వ‌ర్మ‌ను సైతం ఇదే నాగార్జున త‌న శివ సినిమా ద్వారా వెండి తెర‌కు ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక అన్న‌పూర్ణ స్టూడియోస్ నిర్మించే సినిమాల్లో నిర్మాణ వ్యవహారాలన్నీ అక్కినేని వెంకట్ చూసుకునేవారు. ఆయన కథ విని గట్టి నమ్మకం ఉంటేనే నాగార్జున సినిమా ఒప్పుకునేవారు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు అయితే నాగార్జున కథలన్నీ తన మేనకోడలు సుప్రియ ఓకే చేస్తేనే నాగార్జున వరకు వెళ్తున్నట్లు సమాచారం. కథ నచ్చితే ఎన్ని రోజులైనా వెయిట్ చేయడానికి నాగార్జున వెనుకంజ వేయరు.

అలా ఉండడంతోనే  ఓ మంచి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు నాగార్జున. ఆ సినిమా ఏదో కాదు"సంతోషం". ఈ సినిమా నాగార్జున కెరీర్లో బెస్ట్ మూవీ లో ఒకటి. ఈ సినిమా కోసం దాదాపుగా ఆరు మాసాలకు పైగా వెయిట్ చేశాడు నాగార్జున.. అలా ఎందుకంటే.. ఈ సినిమా కోసం ద‌ర్శ‌కుడు దశరథ్.. కేవలం 20 నిమిషాల చిన్న లైన్‌ను మాత్రమే నాగార్జునకు వినిపించాడ‌ట‌. ఈ కథ విన్న నాగార్జున నచ్చడంతో.. నీకు ఈ కథ రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని దశరథ్‌ ని అడిగగా,  అతను కచ్చితంగా ఆరు నెల‌లు ప‌డుతుంద‌ని చెప్పాడ‌ట‌. ఆ క‌థ పూర్త‌య్యే వ‌ర‌కు నాగార్జున మ‌రో క‌థ‌ను ఒప్పుకోలేద‌ట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: