హిందువులందరూ ఎంతో అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకునే పండుగలలో కృష్ణాష్టమి కూడా ఒకటి.  కృష్ణాష్టమి రోజున ఎంతో ప్రత్యేకంగా పూజలు చేయడమే కాదు కృష్ణుడు గోపిక వేషధారణలో అందరూ అలరిస్తూ ఉంటారు. ఇక ఏ కాలనీలో చూసినా ఇలాంటి సంబరాలు కనిపిస్తూ ఉంటాయి.  చిన్నారులను కృష్ణుడు గోపికల వేషధారణలో రెడీ చేసి ఇక వారితో కొన్ని నాటకాలు వేయించడం.. డాన్స్ చేయించడం  లాంటివి కూడా చేస్తూ ఉంటారు.  ఇలా కృష్ణాష్టమి రోజున ఎక్కడ చూసినా ఎంతో మంది కృష్ణులు దర్శనమిస్తూ వుంటారు.  ఇక అటు బుల్లితెరపై కూడా కృష్ణాష్టమి వచ్చిందంటే సంబరాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.



 మరీ ముఖ్యంగా ఈ టీవీ లో ఏదైనా పండగ వచ్చిందంటే ఇక ఆ పండుగకు ఒక ప్రత్యేకమైన ఈవెంట్ ప్లాన్ చేసి అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కృష్ణాష్టమి సందర్భంగా అటు ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్  కార్యక్రమాన్ని వినూత్నంగా ప్లాన్ చేశారు. ప్రస్తుతం జబర్దస్త్ లో కమెడియన్స్ గా కొనసాగుతున్న చైల్డ్ ఆర్టిస్టులను కృష్ణుడు గోపికల వేషధారణలో స్టేజి మీదికి తీసుకొచ్చారు.  ఇటీవలే క్యాష్ వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా లో విడుదలైంది. ఈ ప్రోమో ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.



 ప్రస్తుతం జబర్దస్త్ లో కమెడియన్గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న నరేష్ ఒక కృష్ణుడి వేషంలో రాగా.. ఇక రాకింగ్ రాకేష్ జట్టు లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నా మరో బుడ్డోడు కూడా  కృష్ణుడి వేషంలో వచ్చాడు. ఈ క్రమంలోనే జబర్దస్త్ నరేష్ ఏకంగా తనకు సుమ చేతులతో వెన్న తినిపించాలి అని అడుగుతాడు. నువ్వు నా చేతులతో వెన్న తినే అంత చిన్న వాడిని కాదు అంటూ సుమ చెబుతుంది. లేదు లేదు తినిపించాలి అంటూ నరేష్ మారం చేయడం తో.. ఏకంగా ఇక ప్లేట్ లో ఉన్న వెన్న మొత్తం నరేష్ నోట్లో కుక్కింది. ఇక చాలు చాలు నేను తింటాను నీకు దండం పెడతాను అని నరేష్  చెప్పేంతవరకు తినిపించి ఏకంగా కృష్ణుడు తోనే ఆడుకుంది యాంకర్ సుమ.

మరింత సమాచారం తెలుసుకోండి: