150 సినిమాల రారాజుగా పరిశ్రమను శాసించే మన మెగాస్టార్ చిరంజీవి ఇంత కాలం సుదీర్ఘ కెరీర్ ని కొనసాగించడానికి ఆయన పడ్డ శ్రమ తో పాటు ప్రణాళిక కూడా ఒక కారణం. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని సినిమాలు చేసుకుని ఆ తర్వాత వెళ్లిపోయే ఆషామాషీ రేంజ్ లో కాకుండా మెగాస్టార్ గా ఎదిగే రేంజ్ లో ఆయన ప్రణాళిక రూపొందించుకున్నారు. తొలినాళ్ళలో తను ఎదగడానికి ఎంకరేజ్ చేసిన గురువుల ప్రోత్సాహం తో ఇప్పుడు ఈ రేంజ్ కు ఎదిగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అలా చిరు లోని డైనమిజాన్ని తొలి రోజుల్లోనే గుర్తించి చక్కని పొగడ్తలతో ఆయనలో మరింత ధైర్యం నింపాడు ది గ్రేట్ దర్శకుడు బాపు. అడయార్ యూనివర్సిటీలో నట శిక్షణ పొందే సమయంలోనే చిరంజీవికి ఊహించని సినిమా అవకాశం లభించింది. రాజ్ కుమార్ దర్శకత్వంలో అబ్దుల్ ఖాదర్ నిర్మించిన పునాదిరాళ్లు సినిమాలో తొలి అవకాశం వచ్చింది. చిరంజీవికి ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయన నటనను క్షుణ్ణంగా గమనించి దర్శక నిర్మాత క్రాంతికుమార్ నిర్మించబోయే తదుపరి చిత్రంలో హీరోగా ఎంపిక చేశారు. అదే ప్రాణం ఖరీదు.

ఈ చిత్రంలో కొణిదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవి గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ముందు అంగీకరించిన పునాది రాళ్లు సినిమా అయినా విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు మాత్రమే. నటనతో గుర్తించబడి మంచి అవకాశాలు అందిపుచ్చుకొని తను మెగాస్టార్ గా ఎదగడానికి సరైన ప్రణాళిక తీసుకున్నాడు. ఎవరు లేకపోయినా అవకాశాలు వాటంతట అవే వచ్చాయి అంటే అది చిరు కృషి ఫలితమే. ప్రాణం ఖరీదు సినిమా అనంతరం దర్శకుడు బాపు తను తీయబోయే మనవూరి పాండవులు చిత్రంలోని ఒక ముఖ్యమైన పాత్ర కు చిరంజీవిని ఎంపిక చేయగా ఆ సమయంలో చిరంజీవి కళ్ళు గురించి ఇచ్చిన కితాబు ఆయనలో మరింత ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది ఒకరకంగా చిరంజీవి కళ్లతోనే కోటి భావాలను ప్రకటిస్తాడు అని ఆయన చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: