బాలీవుడ్ నటి రాధికా ఆప్టే బోల్డ్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌లలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న రాధికా మూవీస్ తో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు, బోల్డ్ ఫోటోషూట్ల కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఇప్పుడు మరోసారి ఆమె బోల్డ్ పిక్స్ తో లైమ్ లైట్ లోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెండు ఫోటోలను రాధిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె మరీ గ్లామరస్ అవతార్‌లో కనిపిస్తుంది. ఆమె తెల్లటి బికినీ ధరించి, దాని పైన నల్లటి జాకెట్ ఉంది. దీనితో పాటు మెడలో అందమైన నెక్లెస్ కూడా వేసుకుంది.

ఈ ఫొటోలపైన ఆమె అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. భారీ సంఖ్యలో లైకులు,షేర్లతో ఈరోజు ఆమెను హైలెట్ చేస్తున్నారు. కొందరు కామెంట్ సెక్షన్‌లో హార్ట్ ఎమోజీలను, ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేస్తున్నారు. కానీ మరికొంత మంది మాత్రం ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవలే రాధికా ఆప్టేను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ స్పెషల్ గా ఓ హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేశారు. ట్విట్టర్‌లో రాధికకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. దీనికి కారణం ఆమె ప్రసిద్ధ చిత్రం 'పార్చ్డ్'. ఇందులో ఆమె తన సహనటుడితో కొన్ని బోల్డ్ సన్నివేశాలు చేసింది. సోషల్ మీడియా వినియోగదారులు భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా ఆ దృశ్యాలు ఉన్నాయంటూ మండి పడ్డారు.
 

రాధికా హిందీతో పాటు తెలుగు, ఇంగ్లీష్, మరాఠీ, తమిళం, మలయాళం. బెంగాలీ వంటి భాషల్లో నటించింది. తెలుగులో ఎంఎస్ ధోని, లెజెండ్, లయన్ వంటి సినిమాలలో కన్పించింది. ఇందులో మొదటి రెండు చిత్రాలలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. కానీ ఆ తరువాత ఆమె తెలుగు సినిమాల్లో నటించలేదు. తరచూ బోల్డ్ ఫొటోలతో నెట్టింట్లో రచ్చ చేస్తుంది.  





మరింత సమాచారం తెలుసుకోండి: