అందాల నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ గత కొన్ని రోజులుగా ప్రెగ్నెన్సీ వార్తలతో సోషల్ మీడియాలో నిలుస్తోంది. తాజాగా ఆమె మరోమారు అందరి దృష్టిలో పడింది. ఇటీవల కాలంలో ఐష్ డ్రెస్సింగ్ సెన్స్ బాగా మారిపోయింది. బయట కనిపించినప్పుడల్లా సెన్సిబుల్ గా డ్రెస్ చేసుకుంటోంది. దీంతో ఆమె గర్భవతి అంటూ పుకార్లు చేస్తున్నాయి. ఈ విషయంపై ఐష్ గానీ, ఆమె కుటుంబం గానీ ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఆమె నటిస్తున్న తాజా సినిమాకు సంబంధించిన పిక్ లీక్ కావడం చర్చనీయాంశంగా మారాయి.

ఐశ్వర్యరాయ్ బచ్చన్ చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె "పొన్నియిన్ సెల్వన్" చిత్రంలో కనిపించబోతోంది. ఈ సినిమాలో నుంచి ఆమె పాత్రకు సంబంధించిన పిక్ లీక్ అయ్యింది. ఐశ్వర్య ఎరుపు రంగు పట్టు చీర, భారీ బంగారు ఆభరణాలను ధరించింది. ఇందులో నెక్లెస్, కంకణాలు, పెద్ద చెవిపోగులు ధరించింది. ఈ లుక్‌లో ఐశ్వర్య రాణి పాత్ర పోషిస్తున్నట్టు అర్థమవుతోంది. ఆమె చేతిలో ఫ్యాన్ కూడా ఉంది. చిత్ర బృందం మొత్తం ఐశ్వర్య చుట్టూ కనిపిస్తుంది. ఆమె దగ్గర పెద్ద బూమ్ మైక్ ఉంచారు. ఈ సినిమాలో ఐష్ నందిని, ఆమె తల్లి మందాకిని... అంటే ద్విపాత్రాభినయం చేయబోతోంది అన్నమాట. మణిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో ఐశ్వర్య కాకుండా విక్రమ్, కార్తీ, త్రిష కృష్ణ, ప్రకాష్ రాజ్, జైరామ్ రవి, ఐశ్వర్యలక్ష్మి వంటి ఇతర భారీ తారాగణం పాలు పంచుకుంటోంది. ఈ మూవీ 1995 కల్కి కృష్ణమూర్తి రాసిన "పొన్నియన్ సెల్వన్" నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ పుస్తకాన్ని దక్షిణాన అత్యంత శక్తివంతమైన రాజు తరువాత రాజరాజ చోళునిపై రాశారు. రావణ్, గురు సినిమాల తరువాత ఐష్, మణిరత్నం కాంబో మూడవసారి రిపీట్ అవుతోంది. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాలో తన సంగీతాన్ని అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: