టాలీవుడ్ లో ఒకప్పటి బిగ్ హీరోయిన్ అయిన టబు గురించి పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని తెలుగులో స్టార్ హీరోయిన్ గా నిలిచింది. తెలుగుతో పాటు హిందీ, ఉర్దూ, మలయాళం, తమిళం, ఇంగ్లీష్, మరాఠీ, బెంగాలీ ఇలా చాలా భాషలలో నటించి మెప్పించింది.ఇప్పటికీ సినీ పరిశ్రమలో కొనసాగుతూ వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తూ అలరిస్తుంది. ఇదిలా ఉంటే టబు ఇప్పటికీ  కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని జీవిస్తుందట టబు. ఇక ఈమె భగ్న ప్రేమ గురించి చాలా వరకు అస్సలు ఎవ్వరికి తెలీదని సమాచారం.

టబు సినీ పరిశ్రమకి బాలనటిగా అడుగు పెట్టిందట. ఇక 1991లో కూలి నెంబర్ వన్ సినిమాతో టాలీవుడ్ పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైందని సమాచారం. ఈ సినిమాతో మంచి విజయం అందుకొని ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిందట. ఒక సంవత్సరానికి దాదాపు ఐదు వరుస సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుందని సమాచారం. సుమారు 75  సినిమాలకు పైగా నటించిన టబు ఎక్కువగా స్టార్ హీరోల సినిమాల్లోనే అవకాశాలు అందుకుందని సమాచారం.

సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుందని సమాచారం.తనకు సంబంధించిన ఫోటోలను అలాగే పర్సనల్ విషయాలను బాగా పోస్ట్ చేస్తుందని సమాచారం. ఇక ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని సమాచారం. ఇదిలా ఉంటే గతంలో నాగార్జునకు, టబు కు మధ్య ప్రేమ నడుస్తుందని  వార్తలు ఎక్కువగా వినిపించిన విషయం అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి నటించిన నిన్నే పెళ్ళాడుతా సినిమాతో వీరి మధ్య పరిచయం బాగా పెరిగిందని అదే ప్రేమ అని తెలిసిందని సమాచారం. అందుకే నాగార్జున పై ఉన్న అపారమైన ప్రేమ వల్లనే ఇప్పటి వరకు టబు పెళ్లి చేసుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

నాగార్జున మాత్రం తమ మధ్య ఎటువంటి ప్రేమలేదని తెల్చేసాడట. మేము కేవలం స్నేహితులం మాత్రమే అని చాలాసార్లు చెప్పుకొచ్చాడని సమాచారం.కానీ టబు మాత్రం తమ మధ్య ఏదో సంబంధం ఉన్నట్లే మాట్లాడుతుందని వార్త వినిపిస్తుంది.నాగార్జున కోసమే ఆయన ఇంటి దగ్గరలోనే టబు ఇల్లు కొనుక్కుందని గోసిప్ వినిపిస్తుంది. ఇక నాగార్జున ముంబైకి వెళ్ళినప్పుడు టబు ఇంట్లోనే ఉండేవాడట.ఇక వాళ్ళిద్దరూ చాలాసార్లు మీడియాకు కూడా చిక్కినట్లు సమాచారం. నాగార్జున రెండవ భార్య అయిన అమలకు కూడా వీరి ప్రేమ గురించి తెలుసనీ పుకార్లు వినిపిస్తున్నట్లు సమాచారం . కానీ నాగార్జున మాత్రం తనను మంచి ఫ్రెండ్ గా మాత్రమే చూశానని చాలాసార్లు తెలిపాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: