టాలీవుడ్ లో మరోసారి న్యూ కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి.  హీరోలు ఇప్పుడు కొత్త దర్శకులతో కొత్త హీరోయిన్ల తో జోడీ కడుతూ మరింత ఆసక్తి నీ తమ సినిమా లపై పెంచుతున్నారు. ఇప్పటికే పెద్ద పెద్ద డైరెక్టర్లతో కమిట్ అయిన సినిమాలను చేస్తూ వాటిని పూర్తిచేసే దిశగా వెళుతున్న మన హీరోలు సరికొత్తగా వెరైటీ వెరైటీ కాంబినేషన్లతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ముందుకు రాబోతున్నారు. ఈ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోయిన్ల పేర్లు కూడా ఉన్నాయి.

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న కొత్త కాంబినేషన్ లు ఏమిటో ఇప్పుడు చూద్దాం. చిరు కొత్త సినిమాల అప్డేట్లు చూస్తే టాలీవుడ్ మొత్తం షేక్ అవుతుంది. ఇప్పటికే అనౌన్స్ చేసిన మూడు సినిమాలను కాకుండా మరో రెండు కొత్త సినిమాలను కూడా సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని చూస్తున్నాడట చిరు. సంపత్ నంది దర్శకత్వంలో ఒకటి,  మారుతి దర్శకత్వంలో ఒకటి త్వరలో చిరు చిత్రాలు రాబోతున్నాయని తెలుస్తోంది. ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు.

ఆ తరువాత రాజమౌళి, అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులతో సినిమాలు చేయబోతున్నాడు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా చేరినట్లు సమాచారం. ఇక కేజీఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న యశ్ టాలీవుడ్ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తో ఓ సినిమా చేయనున్నాడు. అలాగే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బిజీగా ఉండగానే ఐకాన్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో అలాగే పరుశురాం తో కూడా సినిమాలకు సన్నాహాలు చేస్తున్నాడు బన్నీ. అలాగే ఇతర దర్శకులు హీరోలు కూడా ఇదివరకు పనిచేయని వారితో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: