2003లో మలయాళం లో విడుదలైన మనస్సినక్కరే అనే మూవీతో చిత్రసీమకు పరిచయమైన స్టార్ నటి నయనతార, ఆ తరువాత మూడు సినిమాల అనంతరం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రూపొందిన చంద్రముఖి మూవీలో నటించారు. అప్పట్లో ఆ మూవీ తో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుని ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత సూర్య తో ఆమె చేసిన గజినీ సినిమా కూడా సూపర్ హిట్ కొట్టడంతో హీరోయిన్ గా ఆమెకు మరింత క్రేజ్ దక్కింది. అనంతరం తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన లక్ష్మి మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నయనతార దానితో ఇక్కడ కూడా పెద్ద సక్సెస్ అందుకున్నారు.

ఇక అక్కడి నుండి ఇటు తెలుగు, అటు తమిళంలో వరుస అవకాశాలతో దూసుకెళ్లి పలు విజయాలు సొంతం చేసుకుని స్టార్ నటిగా మంచి క్రేజ్ దక్కించుకున్న నయనతారకి తెలుగు, తమిళ, మలయాళ భాషలో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక కొన్నేళ్ల క్రితం ప్రముఖ డ్యాన్సర్ ప్రభుదేవాతో కొన్నాళ్ళు రహస్య ప్రేమాయణం నడిపిన నయనతార ఆ తరువాత ఆయన నుండి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక ఇటీవల యువ దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో పడ్డ నయనతార, కొన్నాళ్ల క్రితం ఒకరోజున అతడితో కలిసి హాలిడే గడుపుతున్న పిక్ ని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు.

దానితో వారిద్దరి మధ్య ప్రేమ ఉందని అందరూ క్లారిటీకి వచ్చేసారు. అయితే అప్పటి నుండి ఎక్కువగా విగ్నేష్ శివన్ తోనే ఉంటున్న నయనతార, ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ఒక సినిమా కూడా చేస్తున్నారు. కాగా తమ హీరోయిన్ ఎప్పుడు పెళ్లి కబురు చెప్తారా అని నయన్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ అయితే ఇంతకీ ఆ మ్యాటర్ ఎప్పుడు మేడం అంటూ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా నయనతారని అడుగుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్నకి నయన్ ఎప్పుడు సమాధానం చెప్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: