సినిమా షూటింగ్ గ్యాప్ లో ఓ కునుకు తీయడం సినిమా వారికి అలవాటే. ఆ విధంగా హీరోయిన్ రాశి కన్నా ఇటీవలే షూటింగ్ గ్యాప్ లో కునుకు తియ్యడం ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారింది. నాగచైతన్య హీరోగా చేస్తున్న థాంక్యూ సినిమా లో, గోపీచంద్ పక్కా కమర్షియల్ చిత్రాలలో ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. చాలా రోజుల తర్వాత తెలుగు లో ఈమె హీరోయిన్ గా బిజీ కాగా ఇతర భాషల్లో కూడా ఆమె ఫుల్ బిజీ గా ఉన్నారు. అలా తమిళ్ లో కూడా ఆమె రెండు చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో ఒకటి కార్తి సర్దార్ సినిమా కాగా, మరొకటి ధనుష్ సినిమా..

హిందీలో కూడా ఈమె రెండు చిత్రాల్లో నటిస్తూ తన కెరీర్ను గతంలో కంటే ఫుల్ బిజీగా మార్చుకుంది.  ఇలా ఈ చిత్రాల షూటింగ్ కోసం రోజుకో నగరం రోజుకో ప్లేస్ కు వెళుతూ ఆ విధంగా ఆమె ఎంజాయ్ చేస్తున్నా ఆమె ఇప్పుడు ఓ పని చేయడం అందరికీ ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.ఆమె షూటింగ్ మధ్య లో నిద్రిస్తున్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళ చిత్రం ధనుష్ సినిమా కోసం ఆమె చెన్నైలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ లో హాయిగా ఆమె కునుకు తీశారు. అంతేకాదు దాన్ని ఫోటో తీయించుకుని మరి తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.

షూటింగ్ గ్యాప్ లో దొరకడంతో నిద్రపోతున్నాను.. నా వెకేషన్ ఎలా ఉండాలో ప్లాన్ చేస్తున్నా అంటూ రాశి చెప్పింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన రాశికన్నా ఆ మధ్య తన కెరియర్ సాఫీగా సాగడ లేదని ఎంతో బాధపడింది. కానీ కానీ ఆ తరువాత తన టాలెంట్ నిరూపించుకుని వరుస సినిమా అవకాశాలు తెచ్చుకుని ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. భవిష్యత్తులో ఇంకా ఎన్ని చిత్రాలలో ప్రేక్షకులను అలరించి వారిని మైమరిపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: