తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఎందరో  సినీ దిగ్గజాలు  తెలుగు వెండితెరకు ఎనలేని సేవలు చేశారు. అయితే, ఆ మహానటుల  నిజ జీవితాలలో   జరిగిన  మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు విశేషాలు  మీ కోసం.

 
ముందుగా   'యస్వీ రంగారావు'గారు.  ఎస్వీయార్ ప్రధాన పాత్రలో నటించిన  'బంగారు పాప' సినిమా  అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో  ప్రదర్శించారు. అయితే,  ఆ  చలనచిత్రోత్సవంలో   'బంగారు పాప'  సినిమాని  చూసిన 'చార్లి చాప్లిన్' ఎస్వీయార్ నటనకు ఫిదా అయిపోయారు. రంగారావు గారి  నటనను  'చార్లి చాప్లిన్' ఆ స్టేజ్ పై  ఎంతగానో కొనియాడారు.  


సీనియర్  ఎన్టీఆర్..   నర్తనశాల సినిమా  చేస్తోన్న రోజులు అవి.  బృహన్నల పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు.  ఆ పాత్రకు న్యాయం చేయాలంటే..కూచిపూడి నాట్యాన్ని నేర్చుకోవాలి అనుకున్నారు ఎన్టీఆర్.  ఐతే అప్పటికే ఎన్టీఆర్ వయసు  40 ఏళ్లు. ఆ వయసులో ఆయన వెంపటి చినసత్యం మాస్టారి వద్ద  కూచిపూడి నాట్యాన్ని నేర్చుకున్నారు.  
 

గుమ్మడి వెంకటేశ్వరరావు  'అర్ధాంగి' చిత్రాన్ని  ఎంతో ప్రత్యేకంగా భావించేవారు. ఎందుకంటే..  'అర్ధాంగి' చిత్రంలో  గుమ్మడికి భార్యగా నటించిన శాంత కుమారి, నిజ జీవితంలో ఆయన కంటే 8 సంవత్సరాలు పెద్దవారు.  అలాగే అదే చిత్రంలో గుమ్మడికి పెద్ద కుమారుడిగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు   గుమ్మడి  కంటే 3 సంవత్సరాలు పెద్ద.  ఇక  గుమ్మడికి చిన్న కుమారుడిగా  నటించిన జగ్గయ్య   గుమ్మడి కంటే ఏడాది పెద్ద. అందరి కంటే చిన్నవాడిని.. అందరికీ పెద్దగా నటించడం నా ప్రత్యేకత అని గుమ్మడి ఎప్పుడు  అంటుండేవారు.      
 

సూపర్ స్టార్  కృష్ణ..  కృష్ణకు మొదటి సినిమా 'తేనె మనసులు'.  ఈ సినిమా దర్శకుడు  ఆదుర్తి సుబ్బారావు గారే కృష్ణను హీరోని చేశారు. ఆ తర్వాత కాలంలో కృష్ణ సూపర్ స్టార్ అయ్యారు. అయితే  'పాడిపంటలు' సినిమా షూటింగ్‌‌  కోసం కృష్ణ  గుంటూరుకి వచ్చారు. అప్పుడు  ఆదుర్తి వారు మరణించారనే విషయం  కృష్ణకు తెలిసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: