అందాల యాంకర్ అనసూయ ఏది చేసిన ప్రత్యేకమనే చెప్పవచ్చు. బుల్లితెరపై యాంకరింగ్ చేసిన, వెండితెరపై వయ్యారాలు ఒలకబోసిన, సోషల్ మీడియా లో అల్లర్లు చేసిన ఇలా దేనిలోనైనా అనసూయ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుంది. మొదటి టీవీ 'షో' ల ద్వారా తెలుగు ప్రజలను పలకరించిన  అనసూయ , ఈటీవీ లో ప్రసారం అయిన 'జబర్దస్త్' టీవీ షో తో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. టీవీ షో లు, సినిమాలు, స్పెషల్ ఈవెంట్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న అనసూయ మొదటగా సినిమాలో కనిపించింది మాత్రం నాగార్జున హీరోగా రమ్యకృష్ణ,  లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాతోనే, ఈ సినిమాలో అనసూయ ఒక పల్లెటూరి అమ్మాయిల, నాగార్జున ను రాము బావ అంటు పిలుచుకుంటూ చేసిన అల్లరికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

 ఈ సినిమా విడుదల అయ్యాక అనసూయ కు వరుసబెట్టి సినిమాలలో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగానే అనేక సినిమాలలో నటించిన అనసూయ వెండితెరపై కూడా తన ముద్రను వేసింది. ఇలా తనను వెండితెరపై ఇంతలా ఆచరించడానికి కారణమైన నాగార్జునకు అనసూయ తనదైన రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. నేడు ఆగస్టు 29 వ తేదీ నా అనసూయ , నాగార్జున  పుట్టిన రోజు సందర్భంగా సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సంబంధించిన స్టిల్స్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే రాము బావ , సినిమాలలో మొదటి సారి నీతో నటించాను , అదో గొప్ప ఆరంభం , ఎప్పుడూ ఇంత అందంగా ఉండడానికి మీరే నాకు స్ఫూర్తి , బంగార్రాజు చిత్రానికి ఆల్ ది బెస్ట్.. అంటూ అనసూయ నాగార్జున కు తనదైన రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: