తెలుగు చిత్ర  పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది సమంత. వివాహం చేసుకున్న తర్వాత కూడా సమంత జోరు తగ్గడం లేదని తెలుస్తుంది. సౌత్ సినిమాలు వరకే స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత  రీసెంట్ గా ఫ్యామిలీ మ్యాన్ 2తో ఇండియా మొత్తం మంచి గుర్తింపు తెచ్చుకుందని సమాచారం.ఫ్యామిలీ మ్యాన్ లో రాజి పాత్రలో సమంత అద్భుతంగా నటించిన విషయం తెలిసిందే.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత బాలీవుడ్ హాట్ బ్యూటీ అయిన అనుష్క శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందట. మీకు చివరగా సోషల్ మీడియాలో డైరెక్ట్ మెసేజ్ చేసిన సెలెబ్రిటీ ఎవరు అని ప్రశ్నించారని సమాచారం. అప్పుడు సమంత అనుష్క శర్మ పేరు చెప్పిందని తెలుస్తుంది.అనుష్క శర్మ తన ఇంస్టాగ్రామ్ స్టోరీకి రియాక్ట్ అవుతూ మెసేజ్ చేయడంతో సమంత అస్సలు నమ్మలేకపోయిందని సమాచారం.

ఏంటి అనుష్క శర్మ నాకు మెసేజ్ చేసిందా అని ఆశ్చర్యపోయిందని సమాచారం. ఈ సందర్భంగా సమంత అనుష్క శర్మపై ప్రశంసలు కురిపించిందట. అనుష్క శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందరిలో చైతన్యం కలిగించే పోస్ట్ లు పెడుతూ అందరిలో  ఉత్సాహం నింపుతారట.అనుష్క శర్మ సందేశాలు చాలా విలువైనవని తెలుస్తుంది.

అనుష్క శర్మ సోషల్ మీడియాని చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుందని అని సమంత పేర్కొందని సమాచారం. అనుష్క శర్మ గర్భవతిగా ఉన్నప్పుడు అలాగే విరాట్ మరియు అనుష్క శర్మ మ్యారేజ్ యానవర్సరీకి సమంత సోషల్ మీడియాలో హార్ట్ ఎమోజీతో రియాక్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం. ఆ తరువాత సినిమాలకు కొంత బ్రేక్ ఇవ్వబోతుందని సమాచారం. ఈ ఖాళీ సమయాన్ని తన కుటుంబ విషయాలకు కేటాయిస్తుందని సమాచారం. మరి చూడాలి తిరిగి సమంత ఎలాంటి కథతో సినిమాలకు ఎంట్రీ ఇవ్వబోతుందో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: