తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఓ సంచలనం అని చెప్పవచ్చు. పదిహేడేళ్ల వయసులోనే స్టార్ హీరో ధనుష్ 3 సినిమాతో ఎంట్రీ ఇచ్చి దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించాడు. తన పాటలతో ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అద్భుతమైన రీతిలో మ్యూజిక్ కంపోజ్ చేసిన అనిరుద్ ఆ సినిమాలోని అన్ని పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా నేపథ్య సంగీతంతో మరింత ఆకట్టుకున్నాడు. దీంతో తమిళ సినిమా పరిశ్రమలో ఒక పెద్ద సంగీత దర్శకుడు పుట్టినట్లు అయ్యింది. దానికి తగ్గట్లుగానే అతను ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు.

వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. దాంతో అప్పటికే తమిళ పరిశ్రమను ఏలుతున్న ఇతర సంగీత దర్శకులు వెనుకబడి పోయారు. ఆయన్ని టాలీవుడ్ కి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు సంవత్సరాలు గా జరగగా పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఇక్కడ ఆశించిన ఆదరణ దక్కలేదు. కానీ ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ జెర్సీ వంటి సినిమాలతో తనేంటో చాటిచెప్పాడు .

త్వరలో ఎన్టీఆర్ కొరటాల శివ ఈ సినిమాకి కూడా సంగీతం అందించనున్నట్లు తెలుస్తుది. దక్షిణాదిన  తన ప్రతిభను చాటుకుని నెంబర్ వన్ సంగీత దర్శకుడిగా ఎదిగిన అనిరుద్ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడ కూడా ఓ భారీ చిత్రంతోనే అరంగేట్రం చేయబోతున్నాడు ఈ యువ సంగీత దర్శకుడు. షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించే సినిమాకు సంగీత దర్శకుడు అనిరుధ్ కావడం విశేషం. ఇప్పటికే స్క్రిప్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. నటీనటుల ఎంపిక జరుగుతోంది. నయనతార నటిస్తుందని తెలుస్తోంది. అనిరుధ్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ కి వెళ్లడం ఆయన అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది. మరి ఇతను బాలీవుడ్ లో ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: