ఒకప్పుడు ఎన్నో సీరియల్స్ లో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను అలరించిన రోహిని ఇప్పుడు జబర్దస్త్ అనే కార్యక్రమంలో రాకింగ్ రాకేష్ టీమ్ లో రెగ్యులర్ కంటెస్టెంట్ గా మారిపోయింది. ఇక రాకింగ్ రాకేష్ స్కిట్ లతో ప్రతీ వారం కూడా సరికొత్త కాన్సెప్ట్ తో తెరమీదికి వచ్చి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే రోహిణి కూడా తనదైన యాక్టింగ్ తో అదరగొడుతు ఉంటుంది.  అయితే గతంలో ఒక స్కిట్ లో ఏకంగా రాకింగ్ రాకేష్ రోహిణి చెంపపై ముద్దు పెట్టిన ఒక వీడియో కాస్తా సోషల్ మీడియాను ఊపేసింది అన్న విషయం తెలిసిందే.



 ఈ స్కిట్ ఇప్పటికీ కూడా అటు బుల్లితెర ప్రేక్షకులందరికీ గుర్తుండే ఉంటుంది..  ఇక ఈ స్కిట్ కు కొనసాగింపుగా ఇటీవలే మరో స్కిట్ కూడా చేశారు రాకింగ్ రాకేష్ టీం. ఇటీవలే 350 ఎపిసోడ్ లో భాగంగా ఏకంగా రాకింగ్ రాకేష్ స్కిట్ ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. ఇక స్కిట్ లో భాగంగా నటి రోహిణి రాకింగ్ రాకేష్ కు లిప్ లాక్ పెట్టడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది అని చెప్పాలి. ఇక స్కిట్ చేస్తున్న సమయంలో  మా అమ్మాయిని ఎందుకు ముద్దుపెట్టుకున్నావంట  కదా అంటూ ఒక వ్యక్తి అడుగుతాడు. అవును అప్పుడు ఏదో పొరపాటున జరిగింది. మీరు నిజంగా భార్య భర్తలేనా  అని అడగడంతో ఇలా ముద్దు పెట్టుకున్నాను అంటూ మరోసారి రోహిణి చెంప మీద ముద్దు పెడతాడు రాకింగ్ రాకేష్.



 దీంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఆ తర్వాత స్కిట్ ఎండింగ్ సమయంలో అప్పుడు ఎందుకు ముద్దు పెట్టాను అని కెమెరామెన్ కి సరిగ్గా అర్థం కాలేదట అంటూ మరోసారి ఒకప్పటి స్టోరీ చెబుతూ ముద్దు పెట్టేందుకు ప్రయత్నిస్తాడు రాకింగ్ రాకేష్. ఈ క్రమంలోనే ఏకంగా రోహిణి రాకింగ్ రాకేష్ కి లిప్ లాక్ పెట్టేస్తోంది.  దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా అవాక్కవుతారు. ఇలా ఎక్స్ ట్రా  జబర్దస్త్ 350 వ ఎపిసోడ్ మాత్రం చాలా గ్రాండ్ గానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది. ఇక ఈ సారి కూడా అంతకు మించి అనే రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ పక్క అన్న రీతిలోనే ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో అందరిని ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: