మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో కుటుంబ కథా చిత్రాలు వచ్చాయి. కుటుంబ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలు... తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.  ఈ కుటుంబం నేపథ్యంలోనే వచ్చిన చిత్రం "అతడు". ఈ సినిమా కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా... 2005వ సంవత్సరంలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు మరియు త్రిష హీరో హీరోయిన్లుగా నటించారు. అలాగే శివాజీ షిండే, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, రాజీవ్ కనకాల, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరియు ఇతర కీలక నటులు ఈ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా కు జయభేరి కిషోర్ నిర్మాతగా వ్యవహరించగా మణిశర్మ సంగీత స్వరాలు అందించారు. ఇక ఈ సినిమా... కుటుంబ నేపథ్యం లో వచ్చింది. ఒక కుటుంబం అంటే ఎలా ఉండాలి. 

వారి కోసం మనమేం చేయాలి. కుటుంబ సభ్యుల మధ్య బంధం ఎలా ఉండాలి అనే యాంగిల్ లో ఈ సినిమా స్టోరీ నడుస్తుంది. ఇక ఈ సినిమా స్టోరీ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాలో మహేష్ బాబు   ప్రొఫెషనల్ కిల్లర్. మహేష్బాబు స్నేహితుని పాత్రలో సోనూసూద్ నటిస్తాడు. వీరిద్దరూ కలిసి మర్డర్స్ ప్లానింగ్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే శివాజీ సిండే ను చంపాలని వీరికి సుఫారీ అందుతుంది. అయితే ఈ సమయంలోనే సోనూసూద్... మహేష్ బాబును మోసం చేసి... ఈ హత్య కేసులో మహేష్ బాబును  ఇరికిస్తాడు. దీంతో మహేష్బాబు అక్కడి నుంచి పారిపోయి.. పాశర్లపూడి వెళ్తాడు. రాజీవ్ కనకాల స్థానంలో మహేష్ బాబు... అతని ఇంట్లోకి పార్ధు గెటప్ ఎంట్రీ ఇస్తాడు. ఇక ఆ పార్ధు పార్ధు కుటుంబంతో మహేష్ బాబు ఎలా ఉంటాడు... వారికి ఏ విధంగా సహాయ పడుతాడు అనే అంశాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ బాగా చూపించారు.

పార్ధు కుటుంబంలో బంధాలు మరియు ఆప్యాయతలను చూసి మహేష్ బాబు ఫిదా అయిపోతాడు. కుటుంబం ఉంటే ఇంత బాగుంటుందా ? అని ఆశ్చర్య పోతాడు. ఇంకేముంది ఆ కుటుంబానికి ఎలాంటి కష్టం వచ్చినా మహేష్ బాబు అండగా ఉంటాడు. ఈ నేపథ్యంలోనే త్రిష మహేష్ బాబు ప్రేమలో పడుతుంది. ఇక క్లైమాక్స్ లో ఆ కుటుంబానికి మహేష్ బాబు గురించి తెలిసిపోతుంది. అయితే సిబిఐ ఆఫీసర్ గా వచ్చిన ప్రకాష్ రాజ్ ... మహేష్ బాబుకు హెల్ప్ చేయడం తో... శివాజీ శిండే మర్డర్ నుంచి తప్పించుకుంటాడు. క చివరికి మహేష్ బాబు చేసిన సహాయం తెలిసిన పార్ధు కుటుంబం మళ్లీ మహేష్ బాబు పై ఆప్యాయతను చూపిస్తుంది. ఇలా ఈ సినిమాను.. కుటుంబ నేపథ్యం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా చక్కగా తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తే... ఎగబడి చూస్తారు జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: