అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా రాచకొండ విద్యాసాగర్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, క్రిష్‌ సమర్పణలో శిరీష్, రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన సినిమా 'నూటొక్క జిల్లాల అందగాడు'. ఈ సినిమా సెప్టెంబర్ 3వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ సందర్భంగా హీరోయిన్ రుహాని శర్మ మాట్లాడుతూ.. ఎవరికైనా బాహ్య సౌందర్యం మాత్రమే ముఖ్యం కాదు.. మన స్వభావం, అంతర్గత వ్యక్తిత్వం కూడా  ఉన్నతంగా ఉండాలి. మనం ఎలా ఉన్నా మనం మౌనంగా ఒప్పుకునే తత్వమే అందం అని అన్నారు నటి రోహిత్ శర్మ.
అదేవిధంగా రుహాణి శర్మ 'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమా గురించి మాట్లాడుతూ.. బట్టతల ఉన్న ఒక వ్యక్తి తనను తాను ఇష్టపడడు.. కానీ ఒక అమ్మాయిని మాత్రం ప్రేమిస్తాడు.. తన  ప్రేమను దక్కించుకోవడానికి ఆ యువకుడు ఏం చేస్తాడు.? చివరికి తనను తాను ఎలా ప్రేమించుకున్నడు.? అన్నది మా 'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమా కథ.

 
అవసరాల శ్రీనివాస్ ఒక గొప్ప నటుడు మరియు ఒక గొప్ప దర్శకుడు అలాగే ఒక మంచి రైటర్. ఇది మాత్రమే కాకుండా ఒక లవ్లీ కో స్టార్. డైరెక్టర్ విద్యాసాగర్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు అని రోహిణి తెలిపింది.
స్క్రీన్ పై ఎంత సమయం కనిపించావు అన్నది ముఖ్యం కాదు. ఆ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉన్నది అనేది ముఖ్యం. తమిళ ,హిందీ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్నాను. ఎక్కువ ఫోకస్ మాత్రం తెలుగు చిత్రాలపైనే పెట్టాను. నాని నిర్మిస్తున్న 'మీట్‌ క్యూట్‌' ఆంథాలజీలో సత్యారాజ్‌తో కలిసి ఒక భాగంలో యాక్ట్ చేశాను. తెలుగులో మరో ఆంథాలజీలో కూడా నటించాను. నాకు వ్యక్తిగతంగా లవ్ స్టోరీ లు సైకో థ్రిల్లర్ లు అంటే ఇష్టం. సైకో పాత్రలో కనిపించాలని ఉంది. అని రుహాణి శర్మ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: