పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినీ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతూనే, అటు రాజకీయాల్లోనూ ఎంతో గుర్తింపు పొందిన వ్యక్తి. తన గురించి తాను ఎప్పుడూ పాపులారిటీని చేసుకోలేదు, అలాగని పాన్ ఇండియా స్టార్ కూడా కాదు.. కానీ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా , జపాన్లో కూడా ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు అంటే , ఇక ఈయన టాలెంట్ ఎంత గొప్పదో మనం ఊహించలేము. పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వెళ్ళినా, ఇటు రాజకీయాల నుంచి సినిమాల్లోకి వచ్చినప్పటికీ , ఈ రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్న వ్యక్తి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పవన్ కళ్యాణ్, నాటి నుంచి నేటి వరకు ప్రతి రోజూ ఏదో ఒక కష్టాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు..


అంతేకాదు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అని విమర్శకుల పాలు కూడా అవుతున్నాడు..ఇకపోతే మొదట భార్య నందిని తో గొడవపడి విడిపోవడానికి గల కారణం ఏమిటి..? తప్పెవరిది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పవన్ కళ్యాణ్ మొదటి సారిగా 1997 మే నెలలో నందిని తో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.. కానీ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ తనకు సరిగా నచ్చలేదు అని, చిన్న చిన్నగా ఇంట్లో ఇద్దరు గొడవ పడుతూ ఉండేవారు. ఇక ఇది కాస్త పెద్ద గొడవకి కారణం అయింది.ఆ గొడవలకి కారణం.. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తో డేటింగ్ లో ఉన్నాడు అని , ఒక బాబు కూడా జన్మించాడు అని,  ఇవన్నీ మొదటి భార్య ఉండగానే ఎలా చేస్తాడు అంటూ, ఆమె కోర్టులో కేసు కూడా వేసింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ నెలకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, హైకోర్టును ఆశ్రయించగా నెలకు ఐదు లక్షలు అంటే చాలా పెద్ద మొత్తం అని హైకోర్టు ఆమె పిటిషన్ ను కొట్టి పారేసింది.

ఇక ఆమె ఉన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ స్థాయిని, ఆమె పరిస్థితిని రెండింటినీ దృష్టిలో పెట్టుకున్న ఉన్నత న్యాయస్థానం ఈమె వేసిన పిటిషన్ కు న్యాయం చేయడంతో, ప్రస్తుతం పవన్ కళ్యాణ్  ఆమెకు ప్రతినెల ఐదు లక్షల రూపాయలను ఆమె ఖాతాలో వేస్తుండడం గమనార్హం. ఇక ఆ తర్వాత రేణుదేశాయ్ ని పెళ్లి చేసుకోవడం విడిపోవడం ఇప్పుడు అన్న జాక్వలిన్ తో జీవనం కొనసాగించడం లాంటివి చూస్తూనే ఉన్నాము.. పవన్ కళ్యాణ్ పడిన కష్టాలను తెలుసుకుంటే మాత్రం, ఎవరూ ఆయనను తప్పుబట్టరు అని చెప్పవచ్చు. ఇక ఆయన గురించి తెలుసు కాబట్టే మొత్తం దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: