చిరంజీవికి మెగాస్టార్ అని, మోహన్ బాబు కలెక్షన్ కింగ్ అని, కృష్ణకు సూపర్ స్టార్ అని, బాలకృష్ణకు నటసింహం అని బిరుదులు ఉన్నట్లుగానే పవన్ కళ్యాణ్ కు కూడా పవర్ స్టార్ అనే బిరుదు ఉన్న విషయం తెలిసిందే.. అయితే ఈ పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది..? ఎవరిచ్చారు ..? అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం...


పవన్ కళ్యాణ్ తన పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి బాటలోనే నడుస్తూ, అన్నకు తగ్గ తమ్ముడుగా గుర్తింపు పొందాడు.. అయితే ఈ పవర్ స్టార్ అనే బిరుదు వెనక.. పవన్ కళ్యాణ్ మొదటి సారి కళ్యాణ్ కుమార్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.. అయితే సినిమాల్లోకి రాక ముందు మొదట అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తన రెండవ అన్నయ్య నిర్మించిన , కొన్ని చిత్రాలకు సహ నిర్మాతగా కూడా పనిచేశాడు. మొదటిసారిగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈవీవీ. సత్యనారాయణ దర్శకత్వం వహించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా,  ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో కాలేకపోయింది.

కాకపోతే ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రాశి హీరోయిన్ గా తెరకెక్కిన గోకులంలో సీత సినిమా తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే గోకులంలో సీత చిత్రానికి krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి మాటలు అందించిన విషయం తెలిసిందే.. మంచి విజయాన్ని అందుకోవడంతో విలేకరుల ముందు ఏర్పాటుచేసిన సమావేశంలో పోసాని కృష్ణ మురళి పవర్ స్టార్ అని సంబోధించడం జరిగింది.. ఆ తరువాత పత్రిక వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ముందు పవర్ స్టార్ అనే బిరుదు తో కథనాలు రాయడం మొదలు పెట్టాయి..

సినిమా నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారిపోయాడు పవన్ కళ్యాణ్.. ఆయన మూడవ చిత్రం సుస్వాగతం సినిమాలో మొదటిసారిగా కళ్యాణ్ కుమార్ కాస్త పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే బిరుదుతో టైటిల్ కార్డు వేయడం జరిగింది..


మరింత సమాచారం తెలుసుకోండి: