మంచి సినిమా అని పేరు వచ్చినా.. కలెక్షన్స్ రాబట్టలేక కమర్షియల్ ప్లాప్ అయిన చిత్రాలు చాలా ఉన్నాయి.  వాటిల్లో ముఖ్యమైనవి కొన్ని చూద్దాం.  



 అప్పట్లో ఒకడుండేవాడు:  


 ఒక సాధారణ యువకుడి  జీవితాన్ని దగ్గర నుంచి చూపించిన సినిమా ఇది.  ఎదగాలనుకున్న ప్రతిసారీ పరిస్థితులు  అదఃపాతాళానికి పడిస్తే..   ఆ  ఎత్తు పల్లాలను ఎలా ఎదుర్కొన్నాడు అని  కళ్ళకి కట్టినట్లు చూపించిన సినిమా.  తొంభైవ దశకంలోని   నేపధ్యాన్ని తీసుకుని దానికి క్రికెట్, మాఫియా, నక్సలిజం అనే అంశాలను జోడిస్తూ అద్భుతంగా తెరకెక్కించారు. కానీ  ఈ సినిమా థియేటర్లలో  ఆడలేదు.  




కృష్ణం వందే జగద్గురుం


మంచి మూవీగా  మంచి కంటెంట్ గా  ఈ సినిమాకి మంచి నేమ్ ఉంది.  కానీ,  ఈ మూవీ కూడా థియేటర్ లో ఆడలేదు. కమర్షియల్ గా ఈ సినిమా ప్లాప్.  



ఖలేజా


అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించలేరు... జరిగిన తరువాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు.  ఈ డైలాగ్ చాలు ఈ సినిమా స్థాయి గురించి చెప్పడానికి.  కానీ,  ఈ సినిమా పెద్ద ప్లాప్ చిత్రం. అయితే  పేరుకు గొప్ప చిత్రంగా మిగిలిపోయింది.    

 

అంజి:


మెగాస్టార్ కెరీర్ లోనే స్పెషల్ ఫిల్మ్.  ఆ రోజుల్లో  ఈ సినిమాలోని  విజువల్ ఎఫెక్ట్స్  ఒక అద్భుతం. అయితే,  కథ అంత కొత్తగా లేకపోవడం, అభిమానుల అంచనాలు ఎక్కువ కావడం వల్ల  ఈ సినిమాకి  ఆశించిన ఫలితం దక్కలేదు.



జోష్:


ఈ సినిమాలో కంటెంట్ కి కూడా మంచి నేమ్ వచ్చింది. అయితే,  కథానాయిక ఇంకా సినిమా విడుదల అయిన సమయం వలన  ఈ సినిమా అంతగా ఆడలేదు.  కానీ బుల్లితెర పై ఈ సినిమా  సూపర్ హిట్ అయింది.   
 



లీడర్ :  

రాజకీయాల పై వచ్చిన తెలుగు చిత్రాల్లో  ఈ చిత్రం సినీ అభిమానులకు  ఆల్‌ టైం ఫేవరెట్ మూవీ.  కానీ, ఈ చిత్రం కూడా  ప్లాప్ చిత్రమే.  


 
మొత్తానికి మంచి చిత్రాలుగా పేరు ప్రఖ్యాతలు సాధించినా..  కలెక్షన్స్ ను రాబట్టలేక  బాక్సాఫీస్  చేతులెత్తేసిన సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి.  వాటిల్లో కొన్ని      


వన్ నేనొక్కడినే,

స్పైడర్,
 
మల్లేశం,

డియర్ కామ్రేడ్,

అంతరిక్షం,

ఆర్య2,

ఊసరవెల్లి,

కృష్ణార్జున యుద్దం,
 
జాను,

ఒక్కడున్నాడు,

 
కారణాలు ఏమి అయిన, ఈ పై  సినిమాలు అన్ని ఎక్కువ జనాదరణ పొందలేదు. ఐతే ఈ చిత్రాలు మాత్రం కచ్చితంగా చూడతగ్గవి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: