సాధారణంగా హీరోల కోసం, దర్శక నిర్మాతలు వారి డేట్స్ ఎప్పుడు ఖాళీగా ఉంటాయో చూసుకొని, సినిమా స్టార్ట్ చేస్తూ ఉంటారు.ఇక ఒకవేళ హీరోయిన్లు కొద్దిగా లేట్ అయితే ఒకటి రెండు రోజులు ఎదురుచూడడం మామూలే. ఇక్కడ ఒక ఐటమ్ గర్ల్ కోసం సినిమా హీరోలతో పాటు దర్శక నిర్మాతలు కూడా ఈమె డేట్స్ కోసం ఎదురు చూసేవారు.అంతేకాదు ఈమె డేట్స్ ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడే వారి సినిమాలను పెట్టుకోవడానికి ప్రయత్నం చేసేవారు మన తెలుగు స్టార్ హీరోస్.. ఇంతకూ ఎవరా ఐటమ్ గర్ల్ అని ఆలోచిస్తున్నారా..? ఆలోచించాల్సిన పని ఏమీ లేదు.. ఆమె ఎవరో కాదు ఐటమ్ గర్ల్స్ కి పెట్టింది పేరు జ్యోతి లక్ష్మి. జ్యోతిలక్ష్మి అంటేనే ఐటమ్ గర్ల్ గా దక్షిణ భారత సినీ ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణి.


ఇటీవల కాలంలో ముంబై లేదా ఇతర దేశాల నుంచి ఐటమ్ గర్ల్స్ ను తీసుకుంటున్నారే..తప్ప, ఆ కాలంలో అందరికీ అన్ని సినిమాలలో ఐటెం సాంగులలో మెప్పించేది మన జ్యోతి లక్ష్మినే. ఈమె వేసేది వ్యాంప్ పాత్రలే అయినప్పటికీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఈమె కోసమే ప్రేక్షకులు సినిమాలు చూడడానికి వెళ్లేవారు. ఒకసారి జ్యోతిలక్ష్మి కి చీర కట్టి విజయ చిత్రం పత్రిక లో ఆమె ఫోటోను అచ్చు వేయిస్తే, ఆ పత్రిక అధిపతి  విజయ సంస్థ అధినేత నాగిరెడ్డి జ్యోతి లక్ష్మి కి చీర కడితే ఎవరు చూస్తారయ్యా..!  అంటూ అన్నారాయన.. అంటే ఆమె కేవలం ఐటమ్ సాంగ్ లకే కాదు ఆహార్యం లో కూడా ఆమెకు అభిమానులు ఉన్నారు.. అందులో ఎలాంటి సందేహం లేదు.


ఈమె కృష్ణ ,ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి పలువురు స్టార్ హీరోల సినిమాలలో ఐటమ్ గర్ల్ గా మెరిసింది. జ్యోతిలక్ష్మి మేనత్త ఎస్ పీ ఎల్ ధనలక్ష్మి అప్పట్లోనే మంచి గుర్తింపు పొందిన నటి. ఈమె జ్యోతిలక్ష్మి ని దత్తత తీసుకొని అన్ని విధాల ,అన్ని రకాల ఆమెకు శిక్షణ ఇచ్చి ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: