హీరో విజయ్ సేతుపతిని పాన్ ఇండియన్ స్టార్ గా మార్చేందుకు ప్రేమ్ కుమార్ చాలా కష్టపడుతున్నాడు. తెలుగులో విజయ్ సేతుపతికి ఇంతగా గుర్తింపు రావడంకు కారణం '96'ఫిలిం. తమిళంలో వచ్చినా కూడా సబ్ టైటిల్స్ తో మన తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాను బాగా ఆదరించారు. ఆ తర్వాత తెలుగులో జానుగా రీమేక్ అయింది. ఒరిజినల్ వర్షన్ 96ను విజయ్ సేతుపతి, త్రిషలు చేస్తే తెలుగులో జానును శర్వానంద్, సమంతలు చేసిన విషయం తెల్సిందే. తెలుగు, తమిళంలోనూ  ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు.

విభిన్న చిత్రాల దర్శకుడిగా యూనిక్ కాన్సెప్ట్ లు ఎంపిక చేసుకునే దర్శకుడిగా ప్రేమ్ కుమార్ కు మంచి పేరు వచ్చింది. అలాంటి ప్రేమ్ కుమార్ మరో 96 కు రెడీ అవుతున్నాడా అంటే ఔను అనే సమాధానం వినిపిస్తుంది. కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి హీరోగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో త్వరలో ఒక సినిమా పట్టాలెక్కబోతుంది. ఈ సారి కేవలం తమిళంలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా సినిమా గా రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నారని కోలీవుడ్ మీడియా వర్గాల వారు అంటున్నారు.

మక్కల్ సెల్వన్ తమిళం,తెలుగుతో పాటు హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ సమయంలో  ప్రేమ్ కుమార్ సినిమా అంటే ఖచ్చితంగా మరో రేంజ్ లో ఉంటుంది. అనే నమ్మకంను వ్యక్తం అవుతుంది. పెద్ద ఎత్తున అంచనాలున్న వీరి కాంబో మూవీ గురించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సినిమా షూటింగ్ లతో విజయ్ సేతుపతి బిజీగా ఉండగా దర్శకుడు ప్రేమ్ కుమార్ మాత్రం స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్నాడని అంటున్నారు. మరో 96 రేంజ్ లో వీరి కాంబో కొత్త సినిమా ఉంటే మాత్రం ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: