హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ప్రేక్షకుల కోసమే లాంచ్ అయిన ఓటీటీ ప్లాట్ ఫాం ‘ఆహా’ దూసుకుపోతున్నది. ఆహా ఒరిజినల్స్‌గా ఇప్పటికే పలు ప్రోగ్రామ్స్, సిరీస్, సినిమాలు విడుదల కాగా అవి ప్రేక్షకులను అలరించాయి. తాజాగా మరో ఆహా ఒరిజినల్ రాబోతున్నది. యంగ్ హీరో సంతోష్ శోభన్ ఇందులో లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ మ్యాజికల్ లవ్ డ్రామా త్వరలో ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. సంతోష్ శోభన్, టీనా శిల్పరాజ్ హీరో, హీరోయిన్స్‌గా నటించింన ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’సినిమా ‘ఆహా’లో విడుదల కానుంది. కాగా, ఇందుకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 

బేకింగ్ వృత్తిలో ఉన్న ఓ కుర్రాడి హృదయాన్ని దోచిన ఆ యువతిగా శిల్పారాజ్ కనిపించనుంది. ఇకపోతే టీజర్ ఆద్యంతం ఆహ్లాదకరంగా కనిపిస్తున్నది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటోంది. హీరో సంతోష్ శోభన్ బేకర్‌గా కనిపించనున్నాడు. లవ్ అండ్ ఎమోషన్స్‌కు ఈ సినిమాలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు టీజర్ చూస్తే అర్థమవుతున్నది. ఇకపోతే భావోద్వేగా పూరితమైన సన్నివేశాల్లో సంతోష్ శోభన్ ఇరగదీస్తాడని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘బేకర్ అండ్ ది బ్యూటీ’ ఈ నెల 10 న ఆహా వీడియోలో ప్రీమియర్ కానుంది. ఈ సినిమాకి జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు. సంతోష్ శోభన్, మెహ్రీన్ నటించిన ‘మంచిరోజులొచ్చాయి’ చిత్రం త్వరలో విడుదల కాబోతుందని తెలుస్తోంది. సంతోష్ శోభన్ తెలుగు ఇండస్ట్రీలో ఇఫ్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఫీల్ గుడ్ సినిమాలే. కాగా, వాటి ద్వారా యూత్‌లో మంచి ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు సంతోష్. ‘పేపర్ బాయ్, ఏక్ మినీ కథా’ చిత్రాల్లో సంతోష్ పర్ఫార్మెన్స్‌కుగాను మంచి మార్కులే పడ్డాయి. ‘మంచిరోజులొచ్చాయి’ ఫిల్మ్‌ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం. కాగా, ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొని ఉన్నాయి.






మరింత సమాచారం తెలుసుకోండి: