మా ఎన్నికల కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల తేదీలను ప్రకటించాలంటూ గత కొద్ది రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు కృష్ణంరాజు కు లేఖలు రాస్తూ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి సైతం మా ఎన్నిక‌లు నిర్వహించాలంటూ లేఖ రాశాడు. ఇక ఎట్టకేలకు అక్టోబర్ 10 నుండి మా ఎన్నిక‌ల‌ను జ‌రుపుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఎన్నికల తేదీని ప్రకటించడంతో మా ఎన్నికల పై మరింత ఆస‌క్తి పెరిగింది. ఇదిలా ఉండగా శుక్రవారం ప్రకాష్ రాజ్ సిని మా బిడ్డలు అనే పేరుతో తన ప్యాన‌ల్ ను మరియు అందులోని సభ్యులను ప్రకటించాడు. ప్యాన‌ల్ లో ప్రకాష్ రాజ్  (అధ్యక్షుడు), నాగి వీడు (ట్రెజరర్), హేమ, బెనర్జీ (ఉపాధ్యక్షులు), జీవితా రాజశేఖర్ (జనరల్ సెక్రెటరీ), శ్రీకాంత్ (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్) అనితా చౌదరి, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ప్రభాకర్, బ్రహ్మాజీ, కౌశిక్, ప్రగతి, రమణారెడ్డి, శివారెడ్డి, సుడిగాలి సుదీర్, సుబ్బరాజు, సురేష్ కొండేటి ఉన్నారు. కాగా సినిమా బిడ్డలు ప్యానెల్ లో వీరిని సభ్యులుగా తీసుకోవడానికి కారణమేంటో ప్రకాష్ రాజ్ వివరించారు. 

కుర్రాళ్ళకు, మహిళలకు కొత్త వాళ్లకు బుల్లితెర నటీనటులకు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ప్యాన‌ల్ ను ఇలా డిజైన్ చేశామ‌ని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే యంక‌ర్ సుధీర్, యాంకర్ అనసూయ ల‌ను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ గా ఎంచుకున్నానని ప్రకాష్ రాజ్ వివ‌రించారు. అంతేకాకుండా అనసూయ అందరితో కలిసి మాట్లాడగలిగే శక్తి ఉన్న మహిళ అంటూ ప్ర‌కాష్ రాజ్ వ్యాఖ్యానించారు. అన‌సూయ‌కు బుల్లితెర న‌టీన‌టుల క‌ష్టాలు బాగా తెలుసని అన్నారు. అందుకే అనసూయను సెలెక్ట్ చేసినట్టు తెలిపారు. మరోవైపు సుధీర్ గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ... సుధీర్ యూత్ ఐకాన్ అంటూ పొగిడారు. అలాంటి కుర్రాళ్లతో కలిసి పనిచేస్తే తమకు కూడా కొత్త ఆలోచనలు వస్తాయని....వచ్చే తరాలకు వీళ్ళ ఐడియాలు పనికివస్తాయని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ప్రకాష్ రాజ్ తో పాటు మంచు విష్ణు కూడా ఎన్నికల్లో పోటీ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక జీవిత రాజశేఖర్ మరియు హేమ ప్రకాష్ రాజ్ ప్యాన‌లోనే చేరిపోయారడంతో ప్ర‌కాష్ రాజ్ కు మ‌రింత మ‌ద్ద‌తు ఏర్ప‌డింది. దాంతో విష్ణు వ‌ర్సెస్ ప్రకాష్ ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: