అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే.మరికొద్ది రోజుల్లోనే రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు ఈ అక్కినేని కుర్ర హీరో.క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' సినిమాలో నటిస్తున్నాడు చైతూ.ఈ సినిమాలో చైతూ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 10 న ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు కానీ..కొన్ని అనుకోని కారణాల వల్ల రిలీజ్ వాయిదా వేశారు.ఇక త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

ఇక ఇదిలా ఉంటెఈ సినిమాతో పాటూ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఓ చైతూ మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.'థాంక్యూ' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ని ఎప్పుడో లాక్ డౌన్ కన్నా ముందే ప్రారంభించారు.ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఆ మధ్య షూటింగ్ నిమిత్తం ఇటలీ వెళ్లి అక్కడ కొన్ని సన్నివేశాలతో పాటు పాటలను కూడా చిత్రీకరించారు చిత్ర యూనిట్.ఇక ఈ సినిమాలో చైతూ హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడు.ఇక రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.సినిమాలో చైతూ పాత్రతో పాటూ హీరోయిన్ పాత్రకి కూడా చాలా ప్రాధాన్యత ఉందని అంటున్నారు.

ఇక ఇదిలా ఉంటె ఈ సినిమాలో నాగ చైతన్య మొత్తం మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నట్లు సమాచారం.ఇక గతంలో ప్రేమమ్ సినిమాలో మొదటి సారి మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి ఆకట్టుకున్నాడు ఈ అక్కినేని హీరో.ఇక మళ్ళీ ప్రేమమ్ తర్వాత ఇప్పుడు ఈ సినిమాలో కూడా చైతూ వయసు పరంగా మూడు దశలలో కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి.ఇక మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టి..ఈ ఏడాది చివరిలో సినిమాను విడుదల చేయాలనిమేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో పాటూ సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సీక్వెల్ 'బంగార్రాజు' సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు చైతూ.ఈ మధ్యే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: