టాలీవుడ్లో 'తొలివలపు' సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు యాక్షన్ హీరో గోపిచంద్.కానీ ఆ సినిమా ప్లాప్ కావడంతో రెండు సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు.ఆ సమయంలో కనీసం ఆయన వైపు కూడా ఎవ్వరు చూడలేదు.అయితే దాని తరువాత తేజ తెరకెక్కించిన జయం సినిమాతో ప్రతినాయకుడిగా మారాడు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం తో గోపిచంద్ మోస్ట్ వాంటెడ్ అయ్యారు.ఈ సినిమాతో ఆగకుండా నిజం, వర్షం సినిమాల్లో విలన్‌గా నటించాడు.తన విలనిజంలతో గోపిచంద్ నంది అవార్డు కూడా సొంతం చేసుకున్నారు.అయితే అప్పట్లో మాత్రం నెంబర్ వన్ విలన్ గా ఉన్నారు గోపిచంద్.రెమ్యూనరేషన్ కూడా హీరోలు తీసుకునే రేంజ్ లోనే తీసుకునేవారు.

అయితే దీని తర్వాత  ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన 'యజ్ఞం' సినిమాతో హీరోగా సక్సెస్ అయ్యాడు గోపిచంద్. అయితే అప్పటి వరకు విలన్‌గా ఆకట్టుకున్న అతను.. యజ్ఞం సినిమాలో హీరోగా తన సత్తా చూపించాడు.అయితే రవికుమార్సినిమా కోసం మొదట సెలెక్ట్ చేసింది గోపిచంద్ ని కాదు.. ప్రభాస్ కోసం తను ఈ కథను రాసారట.ఈ కథను ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజుకు కూడా వినిపించడం జరిగింది.అయితే ఈ కథ కూడా ఆయనకి నచ్చిందట.కానీ ప్రభాస్ మాత్రం బి.గోపాల్ దర్సకత్వంలోని అడవి రాముడు సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.సీనియర్ దర్శకుడు కావడం వల్ల ప్రభాస్ ఈ సినిమాను ఒప్పుకున్నాడు.

దానితో వేరే దారి లేక గోపిచంద్ ను తీసుకున్నారు డైరెక్టర్ రవికుమార్ చౌదరి.దీని తరువాత ఆంధ్రుడు, రణం, లక్ష్యం, శౌర్యం, లౌక్యం వంటి విజయాలతో స్టార్ హీరో అయిపోయాడు గోపిచంద్.అలా ప్రభాస్ చేయాల్సిన యజ్ఞం సినిమాని గోపిచంద్ చేసి హీరోగా ఫస్ట్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఇదిలా సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్' అనే సినిమా చేస్తున్నాడు గోపిచంద్. సెప్టెంబర్ 10న వినాయకచవితి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో గోపిచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇదే కాకుండా మారుతి దర్శకత్వంలో 'పక్కా కమర్షియల్'అనే సినిమాలో కూడా  నటిస్తున్నాడు గోపిచంద్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: