దేశం మెచ్చిన కుర్రాడు..  ప్రపంచ‌మే నివ్వెర పోయ్యేలా చేసిన క్రీడా కారుడు,  టోక్యో ఒలంపిక్స్ లో  గోల్డ్ మెడల్ తో  ఇండియాకు చేరుకున్న ఆ కుర్రాడిని దేశ క్రీడా సమాజం  నెత్తిన పెట్టుకుని  పొగడ్తల వర్షం కురిపించింది.   అందుకు తగ్గట్టుగానే  అతని మాట‌లు ఉత్తేజాన్ని కలిగించాయి.  త‌న‌ను తాను ఎలా జయించాడో అతను  చెబుతుంటే ఆశ్చర్యం కలిగింది.  


నిజంగానే  అతని ప్రయాణంలో  విజయాన్ని మించిన శ్రమ,  ఉద్వేగాన్ని మించిన ఆశయం కనిపిస్తున్నాయి.   ఆ కుర్రాడే  'నీరజ్ చోప్రా'.   ఇప్పుడు ఈ  విజేత ఆత్మ కథనే  సినిమాగా తీయాలని   సినిమా వాళ్ళు ఉత్సాహ పడుతున్నారు.  అతని క‌థ వింటే ఎవరిలోనైనా   ఉత్సాహం పరవళ్లు తొక్కుతుంది.  అతని జీవితంలో గొప్ప పోరాటం ఉంది.  చిన్న తనం నుండే..  అతను కాలంతో  యుద్ధం చేశాడు.  


క్షణక్షణం తన పరిధిని పరిమితిని పెంచుకుంటూ పోయాడు.  అన్నిటికీ మించి  మరెన్నో మలుపులు నీరజ్ జీవితంలో ఉన్నాయి.  కష్టాలు అవమానాలు మధ్య అతను జీవితం సాగింది. అతను అనుభవించిన ప్రతి బాధను తన విజయానికి పునాదిగా మార్చుకున్నాడు. ముఖ్యంగా ఒక సినిమాకి కావాల్సిన అన్ని అంశాలు నీరజ్ జీవితంలో ఉన్నాయి.  


అందుకే,  అతని  క‌థ‌లో కల్పితాలు కలపక్కర్లేదు.  ఉన్న నిజాన్ని ఉన్నట్టుగానే చెప్పినా..  అద్భుతమైన ఎమోషనల్ యాక్షన్ డ్రామా అవుతుంది ఆ సినిమా.  అయితే, నీరజ్ ఫిజిక్, వయసుకు  అతని బయోపిక్ లో కరెక్ట్ గా సరిపోయే నటుడు కోసం వెతుకుతున్నారు మేకర్స్.  అయితే,  ఫిజిక్ అండ్ ఏజ్ పరంగా అకీరా నందన్,  నీరజ్ పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోతాడు.  


పైగా  పవర్ స్టార్ సినీ వారసుడిగా ఎంట్రీ ఇవ్వడానికి  'అకీరా నందన్'కి  ఇంతకుమించిన గొప్ప  కథ దొరకదు.  మరి, పవన్ కళ్యాణ్  ఫ్యాన్స్ సంతోషం కోసమైనా  'అకీరా నందన్',   నీరజ్ చోప్రా  పాత్రలో నటించాలని  ఆశిద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: