'దిల్ రాజు'.. తెలుగు ఇండస్ట్రీలో   ప్రస్తుతం బలమైన వ్యక్తుల్లో ఒకడు.  దిల్ రాజుకి  సక్సెస్ అనేది   బట్టర్ తో పెట్టిన విద్య అని సినీ జనం కామెంట్స్ చేస్తూ ఉంటారు.  అసలు దిల్ రాజు సక్సెస్  వెనుక  ఉన్న  కారణం మాత్రం ఎప్పుడూ  ఒక్కటే.  ఎవరికైతే టాలెంట్  ఉంటుందో.. వారిని దగ్గరకు తీసుకుని,  వాళ్ళ   టాలెంట్ ను వాడుకుని సినిమాలు చేస్తూ క్యాష్ చేసుకోవడం దిల్ రాజుకి  మొదటి నుండి బాగా అలవాటు అయిన అంశం.  


ఆ మాటకొస్తే..  విషయం  ఉన్న వాళ్ళను  వెతికి  పట్టుకోవడంలోనే సగం సక్సెస్ ఉంది.  ఆ విషయంలో దిల్ రాజును మించినోళ్లు లేరు.  పక్క నిర్మాతలు కూడా  దిల్ రాజు  కాంపౌండ్ నుంచి వచ్చాడు అంటే.. ఆ డైరెక్టర్ లో  మ్యాటర్ ఉంది అని బలంగా  నమ్ముతారు.  అందుకే  దిల్ రాజు బ్యానర్ లో కనీసం ఒక్క సినిమాకి అయినా పని చేద్దాం అని అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా  రోజులు తరబడి దిల్ రాజు ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు.
 

అయితే దిల్ రాజు తన  కాంపౌండ్ లో పని చేయడానికి వచ్చిన డైరెక్టర్స్ లో టాలెంట్ ఉంటే.. వారిని క్యాష్  చేసుకునే వరకు వదిలిపెట్టకుండా.. వారి  చేత సంవత్సరాల తరబడి స్క్రిప్ట్ వర్క్ చేయించి.. మొత్తానికి హిట్ కొడతాడు.  'షాదీ ముబారక్' అనే సినిమా గుర్తు ఉందా ?  చక్రవాకం సీరియల్ హీరో  సాగర్ హీరోగా  వచ్చింది ఈ సినిమా.


ఈ  సినిమాని దిల్ రాజునే  రిలీజ్ చేశాడు.  సినిమా టాక్ అయితే  బాగుంది గాని, సినిమాకి అయితే కలెక్షన్స్ రాలేదు. ఆ కారణంగా  ఆ సినిమా  దర్శకుడు  పద్మశ్రీకి మరో సినిమా రాలేదు. అతని పరిస్థితిని గ్రహించిన దిల్ రాజు  అతనికి అడ్వాన్స్ ఇచ్చి  తన  అఫీస్ లోనే   కూర్చోపెట్టి స్క్రిప్ట్ వర్క్ చేయిస్తున్నాడు.   దిల్ రాజు కోరిక మేరకు ఒక  కథ రాశాడు డైరెక్టర్.  

 
కథ పూర్తి అయినా  సినిమా  మాత్రం ముందుకు వెళ్లడం లేదు.  తనకు సాలిడ్ లాభాలు వస్తేనే  దిల్ రాజు ఒక  సినిమాని ముందుకు తీసుకువెళ్లాడు. కాబట్టి.. మంచి హీరో దొరికే వరకు దిల్ రాజు ఈ  సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడు.  ఫామ్ లో ఉన్న ఏ  హీరో ఖాళీగా లేడు.  కాబట్టి హీరో దొరకాలి అంటే ఏడాది పడుతుంది. అంటే  దర్శకుడు  పద్మశ్రీకి  మరో ఏడాది వరకు  ఎదురుచూపులు  తప్పవు.   మొత్తానికి మరో దర్శకుడు కూడా దిల్ రాజు దెబ్బకు బుక్ అయ్యాడు.  
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: