అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీనియర్ హీరో కింగ్ నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య తనకంటూ సొంత గుర్తింపుని తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచే మంచి లవర్ బాయ్ గా నాగ చైతన్య టాలీవుడ్ లో తనదైన మార్క్ ని సెట్ చేసుకున్నాడు. నాగ చైతన్య చేసిన ప్రేమ కథ సినిమాలాన్ని కూడా దాదాపు అన్ని హిట్ అయిన సినిమాలే.తన తండ్రి లాగే మంచి లేడీ ఫాలోయింగ్ ని సంపాదించుకొని మంచి సక్సెస్ఫుల్ హీరోగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా ఎప్పుడూ కూడా మంచి ఫీల్ గుడ్ సినిమాలతో ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు నాగ చైతన్య. ఇక నాగ చైతన్య కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు వున్నాయి. ఇక అందులో మొదటగా చెప్పుకునే సినిమా అంటే జోష్ అనే చెప్పాలి. జోష్ నాగ చైతన్య మొదటి సినిమా.ఈ సినిమా 2009 లో సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల అయ్యింది. నేటితో ఈ సినిమా 12 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కథతో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో నాగ చైతన్య యాక్టింగ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది.ఈ సినిమాని వాసు వర్మ డైరెక్ట్ చేశాడు. దిల్ రాజు నిర్మించాడు.ప్రముఖ సీనియర్ నటి రాధ కూతురు కార్తీక ఈ సినిమాలో నాగ చైతన్య సరసన హీరోగా నటించింది.అయితే ఈ సినిమా కథ చాలా బాగున్నా కాని కమర్షియల్ గా హిట్ కాలేకపోయింది.అయితే దానికి బలమైన కారణం కూడా వుంది. ఎందుకంటే ఆ సమయంలో మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించారు. ఆయన మరణం కారణంగా చాలా మంది జనాలు కూడా అప్పుడు సినిమాలను ఎంజాయ్ చేసే పరిస్థితిలో లేరు. అందువల్ల జోష్ సినిమా కథ బాగున్నా కాని ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించలేదు.అందువల్ల ఈ సినిమా ప్లాప్ అయింది. అదే కరెక్ట్ టైంలో కనుక ఈ సినిమా రిలీజ్ అయ్యుంటే చైతూకి మంచి బ్లాక్ బస్టర్ సినిమా అయ్యుండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: