తమిళ స్టార్ హీరో  సూర్య.. ఒక్క  రీల్ హీరోనే కాదు,  రియల్ లైఫ్‌ హీరో కూడా.  సైడ్ రోల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి, అతి తక్కువ టైంలోనే సోలో హీరోగా ఎదిగి, స్టార్ హీరోగా నిలబడిన నిజమైన నిఖార్సయిన  హీరో కూడా.  హిట్స్  అవార్డ్స్  రికార్డ్స్ సూర్యకి అలవాటు అయిపోయాయి.  అయితే సూర్య గురించి ఎవరికీ తెలియని విషయాల గురించి.. సూర్యకు  చిన్నారులు  అంటే చాల ఇష్టం. అందుకే, చిన్న పిల్లలకు సంబంధించి చాల రకాల సేవలు చేస్తున్నారు.

ఇప్పటికే,   కొన్ని స్కూల్స్ పెట్టి  ఉచితంగా పేద  పిల్లలకు  విలువైన విద్యను అందిస్తున్నారు.   అలాగే  కొన్ని వందల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించి  వారందరికీ   తిరిగి ప్రాణం పోశారు.  కొన్ని అనాధ ఆశ్రమాలు   దత్తత తీసుకుని  వాటిల్లో  అనేక అభివృద్ది కార్యక్రమాలు  చేపట్టారు.  సూర్యకి రాజకీయాల పై కూడా ఆసక్తి ఉంది. భవిష్యత్తులో ఆయన రాజకీయ రంగ ప్రవేశం  చేసే అవకాశం కూడా  ఉంది.    
 
 ఇక  సూర్య  చేసే సేవ కార్యక్రమంలో  ఆయన  అభిమానులంతా  పాల్గొని  ఘనంగా  ఓ వేడుకలా ఆ కార్యక్రమాన్ని జరిపిస్తారు. అన్నట్టు  సినిమాల విషయానికి వస్తే..   సూర్య మరోసారి ఊరమాస్‌ పాత్రలో ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతున్నాడు.  ‘ఎత్తారెక్కుమ్‌ తునిందవన్‌’ పాండిరాజ్‌ దర్శకత్వంలో  సూర్య హీరోగా  ఓ ఊర మాస్ సినిమా  తెరకెక్కుతోంది.

ఒకపక్క హీరోగా చేస్తూనే.. మరోపక్క   నిర్మాణ రంగంలో కూడా  ఫుల్ బిజీగా ఉన్నాడు.  ఈ రోజు కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. తానూ నిర్మాతగా  స్టార్ డైరెక్టర్ శంకర్ చిన్న కుమార్తె అదితి శంకర్ ను హీరోయిన్ గా పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి విభిన్నంగా ఉంటుందట. అయితే స్టార్ డైరెక్టర్ కూతురు అయి ఉండి కూడా హీరోయిన్ గా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించింది అదితి. మరీ ఆమె భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు చేస్తోందో చూడాలి.    

         


 

మరింత సమాచారం తెలుసుకోండి: