ఈ మధ్యకాలంలో అనుష్క శర్మ తో మొదలు పెట్టి, చాలా మంది స్పోర్ట్స్ స్టార్స్ ని పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఇంకా ఈ నేపథ్యంలోనే భారత టెన్నిస్ స్టార్ గా గుర్తింపు పొందిన లియాండర్ పేస్, ప్రముఖ హీరోయిన్ గా  గుర్తింపు పొందిన కిమ్ శర్మ ..ఇద్దరూ కూడా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. జూలై నెలలో వీరిద్దరూ గోవాలోని ఒక రెస్టారెంట్లో కలిసి దిగిన ఫోటోలను కూడా చేశారు..ఇక ఈ ఫోటోలు  సోషల్ మీడియాలో  తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక  ఫోటోలు బాగా వైరల్ అయిన  తరువాత మీడియా వారు కూడా వీరి జంట పై ఫోకస్ చేయడం మొదలుపెట్టారు.  ఈ నేపథ్యంలోనే ఈ జంట పలుమార్లు కెమెరా కంటికి చిక్కినట్లు తెలుస్తోంది.వీరిద్దరూ కూడా ఈ విషయంపై ఏ విధంగా కూడా స్పందించలేదు. ఇదిలా ఉండగా తాజాగా టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తో ఆమె అత్యంత సన్నిహితంగా తీసుకున్న ఒక ఫోటోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇక దీంతో వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫోటోను ఆమె షేర్ చేస్తూ ఈ ఫోటో కి ప్రేమతో కూడిన ఒక ఈమోజీ కూడా క్యాప్షన్ గా పెట్టడంతో, వీరిద్దరి మధ్య బంధం ఖాయం అయినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి..ఈ ఫోటోలో కిమ్ శర్మ కెమెరా వైపు చూస్తుంటే, ఆమె వైపు లియాండర్ చాలా ప్రేమగా చూస్తున్నట్లు మనం చూడవచ్చు. ఈ ఫోటో కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది..

కిమ్ శర్మ గతంలో క్రికెటర్ యువరాజ్ సింగ్ తో ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే. తర్వాత కెన్యా కు చెందిన ఒక ప్రముఖ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. అతనితో జీవనం కొనసాగించలేక విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కూడా ఈమె హర్షవర్ధన్ రానే తో ఎఫైర్ నడిపినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈమె  మాత్రమే కాదు .. లియాండర్  కూడా ఎంతో మంది అమ్మాయిలతో ఎఫైర్స్  నడిపాడు.గతంలో రియా పిళ్లై  తో సహజీవనం చేసి, ఒక కూతురు కూడా జన్మనివ్వడం జరిగింది . అయితే ఇక వీరిద్దరి పెళ్లి ఎంతవరకు వెళ్తుందో మనం వేచిచూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: