ఒక భాషలో బాగా హిట్ అయిన సినిమాను మళ్ళీ వేరే భాషలో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. అయితే ఇలా ఎక్కువగా తమిళ సినిమాలే తెలుగులో డబ్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ హీరోను బట్టి క్రేజ్ ఉంటుంది. తమిళ హీరోలు అయినప్పటికీ చాలా మంది తెలుగులోనూ ప్రేక్షకులను సంపాదించుకోగలిగారు. వారిలో రజినీకాంత్, కమలహాసన్, విక్రమ్, సూర్య, అజిత్, విజయ్ ఇలా చాలా మంది హీరోలే ఉన్నారు. కానీ కొన్ని సార్లు డబ్బింగ్ ఐన సినిమాలు కూడా ప్లాప్ అవుతూ ఉంటాయి. కొన్ని మాత్రం తమిళ్ లో కన్నా తెలుగులోనే ఎక్కువగా హిట్ అవుతాయి. మరి మాస్ హీరో సూర్య నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆరు మూవీ గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సూర్యకు మొదటి నుండి తమిళ్ లో మాస్ హీరోగా మంచి గుర్తింపు ఉంది. ఇదే మాస్ బ్యాక్ గ్రౌండ్ తో 2005 లో మాస్ డైరెక్టర్ హరి తెరకెక్కించిన చిత్రం "ఆరు". ఇదే సినిమా తమిళ్ లో హిట్ కావడంతో తెలుగులోనూ విడుదల చేసింది చిత్ర బృందం. అయితే తమిళ్ కన్నా మంచి టాక్ తో తెలుగులో సూపర్ హిట్ ను అందుకుంది. ఇందులో సూర్య సరసన త్రిష హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ సినిమా సూర్యను తెలుగు ప్రేక్షకులకు మాస్ హీరోను పరిచయం చేసింది. ఇందులో చేసిన పాత్ర సూర్యను అభిమానుల్లో మరింత ఫాలోయింగ్ రావడానికి కారణం అయింది.

ఈ సినిమాలో ఉన్న పాటలన్నీ ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో సూర్య పేరు ఆరు ఒక అనాధగా స్లమ్ లో కొంతమంది ఆకతాయిల జినాగ్ కు లీడర్ గా తన నతాం అద్భుతమని చెప్పాలి. ఈ సినిమాను కేవలం అయిదు నెలల్లో కంప్లీట్ చేశారు.  ఇదే సినిమాను హిందీ మరియు భోజపురి భాషల్లోనూ డబ్ చేశారు.  ఈ సినిమాలో నటించిన త్రిషకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా తన పవర్ చూపింది. ఈ సినిమా నుండే డైరెక్టర్ హరి మరియు సూర్యల రేలషన్ మరింత బలపడింది. ఆ తరువాత యముడు సినిమాను మూడు సీక్వెల్స్ తీసి సక్సెస్ సాధించి. అత్యుత్తమ హిట్ జోడీగా పేరొందారు.


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: