పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాల్లో హరీష్ శంకర్ తో చేయబోయే సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. 2012 లో గబ్బర్ సింగ్ తో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబో కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక హరీష్ పవన్ కాంబినేషన్ లో రాబోయే రెండో చిత్రం మీద కూడా అనౌన్స్ మెంట్ నుంచే అభిమానుల్లో అంచనాలు బాగా పెరిగాయి. ఈసారి పవన్ హరీష్ శంకర్ ఏ లుక్ లో ఎంత మాస్ గా చూపిస్తారో అని ఫాన్స్ తో పాటుగా తెలుగు ఇండస్ట్రీ అంత ఎదురుచూస్తుంది. అయితే ఈ మద్యనే పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి ఈ సినిమా ప్రి లుక్ విడుదల చేసారు.

దానికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాకముందే అప్పుడే మూవీ టీం నుంచి అప్డేట్స్ మొదలయ్యాయి. రేపు ఉదయం 9:45 కి ఈ సినిమా నుంచి ఒక సూపర్ అప్డేట్ రాబోతుంది అని మూవీ టీం ప్రకటించింది. అయితే ఈ అప్డేట్ ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలేదు కానీ సోషల్ మీడియా లో మాత్రం మూవీ టైటిల్ ని విడుదల చేయబోతున్నారు అనే రూమర్స్ బయటకి వస్తున్నాయి. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా కి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం యొక్క గొప్పతనం ఏంటి అంటే వాళ్ళు హీరో అభిమానులని అర్థం చేసుకొని వాళ్ళకి తగినట్టు గా ఎప్పటికి అప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక ప్రొఫెసర్ గా కనిపించబోతున్నారు అని టాక్. వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే ని అనుకుంటున్నారట. హరీష్ శంకర్ ఆమెతో ఇప్పటికే డీజే , గద్దలకొండ గణేష్ సినిమాలు తీశారు

మరింత సమాచారం తెలుసుకోండి: