ప్రతి హీరో దర్శకుడి కెరీర్ లో కొన్ని కొన్ని చిత్రాలు ఎంతో స్పెషల్ గా నిలుస్తాయి. వాటి ఫలితాలు ఎలా ఉన్నా కూడా ఆ సినిమాలు వారి కెరియర్ ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. అందులో వారు చేసిన నటన, చేసిన దర్శకత్వం వారి కెరియర్ కే మచ్చు తునకలు గా మిగిలిపోతాయి. ఆ విధంగా దర్శకుడు త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కెరియర్ లో అతడు సినిమా కెరీర్ బెస్ట్ సినిమాగా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తొలిసారి వీరిద్దరూ కలిసి చేసిన ఈ చిత్రం వెండితెర ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. బుల్లితెరపై కోట్లాది మంది మళ్లీ మళ్లీ చూసి ఈ సినిమా నీ సూపర్ హిట్ గా నిలిచేలా చేశారు.

అప్పటికే దర్శకుడిగా త్రివిక్రమ్ తొలి అడుగులు వేస్తున్న రోజులు. దీనికంటే ముందు త్రివిక్రమ్ ఒక నువ్వే నువ్వే సినిమానే దర్శకత్వం చేసాడు. రచయితగా చాలా పెద్ద సినిమాలకు పని చేశాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ పై నమ్మకం ఉంచి మహేష్ బాబు ఈ సినిమా అవకాశం ఇవ్వగా సినిమా పరంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది చిత్రం. 2005లో విడుదలైన ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించగా జయభేరి ఆర్ట్స్ పతాకంపై మురళీమోహన్ సమర్పకుడిగా వ్యవహరించగా ఎం.రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రంలో మణిశర్మ సంగీతం హైలెట్ అని చెప్పవచ్చు. 

ఈ చిత్రానికి గాను మూడు నంది పురస్కారాలు వచ్చాయి అంటే ఈ చిత్రం ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరించింది అర్థం చేసుకోవచ్చు. ఉత్తమ దర్శకుడు విభాగంలో దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారం గెలుచుకుంది. తమిళ మలయాళ భాషలలో అనువాదం అయి అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. హిందీలో, బెంగాలీలో పునర్నిర్మించారు.  విదేశీ భాషల్లో కూడా ఈ చిత్రం అనువాదం అయ్యింది.  పోలండ్ లో విడుదలైన మొదటి తెలుగు చిత్రం గా గుర్తింపు పొందింది అతడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: