సూపర్ స్టార్ రజినికాంత్ కి ఒక సాలిడ్ సూపర్ హిట్ పడక చాలా రోజులయింది. ఆయన నుంచి ఈమధ్య  వచ్చిన సినిమాల్లో పెట్ట తప్ప ఏ సినిమాలు అంతగా ఆడలేదు. 2.0 లాంటి ప్రయోగాలు చేసినప్పటికీ అభిమానులు కోరుకునే హిట్ మాత్రం రాలేదు. అందుకేనేమో తమిళంలో మాస్ సినిమాలు తియ్యడంలో దిట్ట అయిన శివ తో కలిసి సూపర్ స్టార్ అన్నత్తే సినిమాని మొదలుపెట్టారు.

 ఈ సినిమా మొదలయినప్పటి నుంచి ఇండస్ట్రీలోను అలాగే జనాల్లోనూ ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇక ఈ సినిమా విడుదల కూడా దీపావళి కి అని మూవీ టీం అనుకుంటున్నారు. విడుదల తేది దగ్గరపడటంతో మూవీ టీం ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టింది. అందులో భాగంగా 10వ తేదీన ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు. ఉదయం 11 గంటలకి ఈ సినిమా ఫస్ట్ లుక్ ని సాయంత్రం 6 గంటలకి మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేస్తున్నాం అని మూవీ టీం ఒక ప్రి లుక్ తో అనౌన్సమెంట్ ఇచ్చింది.
ఇక ఈ సినిమాలో రజిని ముగ్గురు చెల్లిల్లకి అన్నయ్య గా కనిపించబోతున్నారు అని టాక్. అందులో ఒక చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఇక సూపర్ స్టార్ రజిని కి జోడి గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది . తమిళంలో వరసగా అజిత్ సినిమాలని డైరెక్ట్ చేసిన శివకి మాస్ లో మంచి క్రేజ్ ఉంది. హీరోకి తగ్గ రేంజ్ లీక్ ఏలేవేషన్స్ ఇవ్వడంలో ఆయన దిట్ట.ఇక ఈ సినిమాలో రజినికాంత్ ని ఎలా చూపిస్తారో అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కి డి ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు లో కూడా ఈ సినిమాని అన్నయ్య పేరుతో విడుదల చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: