సిటీ మార్ ఈ చిత్రంతో రేపు ప్రేక్షకులను అలరించబోతున్నారు టాలీవుడ్ మ్యాచో మాన్ గోపీచంద్. యాక్షన్ హీరోగా ఎదుగుతూ మంచి మంచి యాక్షన్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు చూపించి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా ఓ వెలుగు వెలిగి పోతున్నాడు గోపీచంద్. ఇటీవల కాలంలో ఆయన వరుస ప్లాపులతో సతమతం అవుతూ ఉండగా ఇప్పుడు ప్రేక్షకులు మెచ్చే విధంగా ఓ భారీ హిట్ కొట్టాలని చెప్పి గోపీచంద్ సంపత్ నంది తో చేతులు కలిపి సీటీ మార్ అనే చిత్రాన్ని చేశాడు. గతంలో వీరిద్దరి కాంబో లో గౌతం నంద అనే సినిమా వచ్చింది.

కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తుండగా గోపీచంద్ కబడ్డీ కోచ్ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు ప్రేక్షకులను ఎంతగానో మెప్పుంచగా సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా మణిశర్మ సంగీతం ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగేలా చేసింది అని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదల కాకముందే గోపీచంద్ మరో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.

మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే ఓ విభిన్నమైన చిత్రాన్ని చేస్తున్న గోపీచంద్ ఆ తర్వాత మరొక యాక్షన్ ఫిల్మ్ ను శ్రీవాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇలా రెండు విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించబోతున్న గోపీచంద్ గతంలో తాను ఓకే చేసి క్యాన్సిల్ చేసిన సినిమాను మళ్ళీ మొదలు పెడుతున్నాడు అనే వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. తేజ దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా చేయాల్సి ఉండగా కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆ చిత్రం క్యాన్సిల్ అయింది. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన కొన్ని మార్పులు చేసుకొని తేజ గోపీచంద్ కు కథ వినిపించగా దాన్ని ఓకే అన్నాడని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: