ఇటీవలి కాలంలో జబర్దస్త్ లో ఎంతో మంది కొత్త కమెడియన్స్ తమ సత్తా చాటుతూ ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.  మొన్నటివరకు జబర్దస్త్ లో ఇమ్మానియేల్ తనదైన శైలిలో  కామెడీ చేసి బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించటం.. ప్రస్తుతం ఎంతో మంది స్కిట్ లలో చేస్తున్నాడు ఇమాన్యుల్.  అయితే ఇటీవలి కాలంలో బాగా క్రేజ్ సంపాదించుకున్న మరో కమెడియన్ ఎవరు అంటే ఫైమా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు పటాస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన ఫైమా అటు జబర్దస్త్ లో అదరగొడుతోంది.



 ఎవరి స్కిట్ లో చేసిన సరే.. తనదైన శైలిలో స్పాంటేనియస్ పంచులతో అదిరిపోయే కామెడీ టైమింగ్ తో ఏకంగా టీం లీడర్ లకు సైతం ఫైమా షాక్ ఇస్తుంది అని చెప్పాలి. ఇలా తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం జబర్దస్త్ లో హండ్రెడ్ స్పీడ్ తో దూసుకుపోతుంది. మామూలుగా ప్రతి వారం ఫైమా బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల విడుదలైన జబర్దస్త్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో లో భాగంగా ఈసారి ఫైమా అటు అదిరే అభి స్కిట్ లో వచ్చింది.




 ఇక అదిరే అభి స్కిట్ లో భాగంగా ఫైమా వరుసగా స్పాంటేనియస్ పంచులు వేస్తూ  టీం లీడర్ అదిరే అభి ని ఒక ఆట ఆడుకుంది అని చెప్పాలి. ఇగో పాహిమా అంటూ అభి పిలువగా..  నాకు ఈగో లేదన్న అంటూ చెబుతుంది ఫైమా..  ఈరోజు హిలేరియస్ స్కిట్ చేయాలి అంటూ అదిరే అభి చెప్పగా.. హిలేరియస్ అనే దగ్గర మస్తు ఫన్ వచ్చింది అంటూ నవ్వుతుంది.. నీ సోది ఆపుతావా అంటూ అదిరే అభి చెప్పగా.. ఎందుకు నువ్వు మొదలు పెడతావా అంటూ పంచ్ వేస్తుంది.. అందుకే కొత్త వాళ్ళను తీసుకురా వద్దు అని చెబుతాను అభి అన్న అంటూ పక్కనే ఉన్న రాము చెబుతాడు.. అరే నాన్న నువ్వు బాగా చేస్తే అసలు కొత్తవాళ్లని తీసుకు రారు అంటూ మరో పంచ్ చేస్తుంది.. ఇలా ఏకంగా టీం లీడర్ అదిరే అభినే ఒక ఆట ఆడుకుంది ఫైమా.

మరింత సమాచారం తెలుసుకోండి: