టాలీవుడ్ లో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ మనకు తెలుసు. ప్రస్తుతం మహేష్ బాబు రెండు సినిమాలో నటిస్తుండగా త్వరలోనే తమిళంలో కూడా ఓ సినిమా చేసే అవకాశం ఉందనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. అయితే ఇప్పుడు మహేష్ బాబు తెలుగు లో ఒక హాలీవుడ్ సినిమాకు డబ్బింగ్ చెప్పే అవకాశం ఉండవచ్చని టాలీవుడ్ లో టాక్ వినపడుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఆ సినిమాకు డబ్బింగ్ చెబుతారని దాదాపుగా సినిమా డబ్బింగ్ కోసం మహేష్ బాబు నాలుగు కోట్ల వరకు తీసుకుంటున్నారని సమాచారం.

అలాగే వచ్చే ఏడాది మహేష్ బాబు మరి కొన్ని సినిమాల మీద దృష్టి పెట్టే అవకాశం ఉందని తమిళంలో కూడా కొన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పే అవకాశం ఉందని ఆయా భాషల్లో మార్కెట్ పెంచుకోవడానికి మహేష్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఫిలిం నగర్ వర్గాల్లో ఎక్కువగా గుసగుసలు వినపడుతున్నాయి. మహేష్ బాబు చేస్తున్న సినిమా విషయంలో స్పష్టత లేకపోయినా వచ్చే ఏడాది సినిమాను సంక్రాంతి నాటికి విడుదల చేసేందుకు ఆయన భార్య నమ్రత కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.

పరిస్థితుల మళ్లీ ఇబ్బంది కరంగా మారకముందే షూటింగ్ పూర్తిచేసి తర్వాత ఇండోర్ వర్కులు పెట్టుకునే ఆలోచనలో చిత్ర యూనిట్ అంటుంది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో పాటుగా కొన్ని సినిమాలను కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు మహేష్ బాబు తన కూతురు ఇతరులతో కూడా ఒక చిన్న షార్ట్ ఫిలిం చేసే ఆలోచనలో ఉన్నాడని టాక్ కూడా ఎక్కువగా వినబడుతోంది. షార్ట్ ఫిలిం విషయంలో ఎక్కువగా మహేష్ బాబు భార్య నమ్రత జోక్యం చేసుకుంటున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: