ఈ సంవత్సరం ఎంతో మంది హీరోలను గట్టెక్కించింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఓ ఇద్దరు హీరో లకు భారీ హిట్ ను అందించింది ఈ సంవత్సరం. వారే మాస్ ప్రేక్షకులకు ఎంతగానో అలరించే రవితేజ మరియు గోపీచంద్. మాస్ రాజా రవితేజ వరుస మాస్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుండగా గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేక పోతున్నాడు. ఈ నేపథ్యంలోనే గోపీచంద్ మలినేని తో కలిసి ఆయన చేసిన క్రాక్ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

అలా ఈ సంవత్సరం వచ్చిన భారీ హిట్ తో రవితేజ తన తదుపరి చిత్రాల విషయం లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్న రవితేజ మరో రెండు సినిమాలను కూడా ఒప్పుకునే పనిలో పడ్డాడు. ఇక పోతే గోపీచంద్ కూడా గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోతున్నాడు. తన కటౌట్ కి తగ్గ మాస్ చిత్రాలు చేస్తున్నప్పటికీ ఆయన సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించ లేక పోయాయి. 

దాంతో ఈసారి సంపత్ నంది తో కలిసి సిటీ మార్ అనే సినిమా చేయగా అది బాక్సాఫీసు వద్ద పరుగులు తీస్తుంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తుంది.  ఈ విధంగా ఒక హీరోకి సంవత్సరం ఆరంభంలో మరొక హీరోకి ఈ సంవత్సరం చివర్లో హిట్ లు రాగా వారి కెరీర్ను నిలబెట్టింది 2021 వ సంవత్సరం. ఇప్పుడు వీరిద్దరూ సాధించిన సక్సెస్ లతో టాలీవుడ్ సినిమా పరిశ్రమ కూడా
 ముందుకు దూసుకు పోతుంది అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. వీరే కాదు చాలా మంది హీరోలకు ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చింది. మాస్ హీరోల లో వీరిద్దరికీ బాగా ఇంకా బాగా కలిసి వచ్చింది. గోపీచంద్ ప్రస్తుతం పక్కా కమర్షియల్ అనే సినిమాను మరియు శ్రీవాస్ దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: