యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన ఖాతాలో ప్రస్తుతం మూడు నాలుగు పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. అందులో ఒక ప్రాజెక్ట్ నిర్మాణానంతర దశలో ఉండగా, షూటింగ్ దశలో మావో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. అన్ని సినిమాల షూటింగ్ లను మ్యానేజ్ చేస్తూ త్వరగా సినిమాలను పూర్తి చేయాలని భావిస్తున్నాడు ప్రభాస్. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ పాన్ ఇండియా స్టార్ ప్రస్తుతం "సలార్" షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

"సలార్" కొత్త షెడ్యూల్ నిన్న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇందులో భారీ యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ లో సినిమాలోని ముఖ్యమైన ఫైటింగ్ సీన్స్ చిత్రీకరించనున్నారట మేకర్స్. కీలకమైన ఇంటర్వెల్ సీన్స్ ను కూడా ఈ షెడ్యూల్‌లోనే తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ 5 నుంచి 7 రోజుల పాటు ఉంటుంది. గత షెడ్యూల్ తెలంగాణలోని గోదావరి ఖని ప్రాంతంలో జరిగింది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన "సలార్" లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ, తెలుగు భాషల్లో ఒకేసారి సినిమాను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. తరువాత హిందీ, తమిళం, మలయాళం వంటి ఇతర భాషలలోకి డబ్ చేస్తారు. మేకర్స్ 2022 ద్వితీయార్ధంలో "సలార్" ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను హోంబలే ఫిల్మ్స్ బ్యాంక్రోలింగ్ చేస్తోంది. ఇక ప్రభాస్ తో పాటు "ఆదిపురుష్", "ప్రాజెక్ట్  కే "లో కూడా నటిస్తున్నారు. మరో చిత్రం "రాధే శ్యామ్" ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.


ఇక ఇటీవలే ప్రభాస్ వెయిట్ లాస్ చికిత్స కోసం లండన్ వెళ్లాడన్న వార్తలు విన్పించాయి. అక్కడ నిపుణుల సమక్షంలో వెయిట్ లాస్ థెరపీని తీసుకోనున్నాడని రెండ్రోజుల క్రితం వార్తలు విన్పించాయి. రీసెంట్ గా ప్రభాస్ లుక్ పై దారుణంగా ట్రోల్ జరిగిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: