అక్కినేని నాగేశ్వర రావు గారు తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప పేరుమోసిన నటుడని అందరికి తెలుసు. ఇక ఈయన సినిమాలు అంటే అంత ఆషామాషీ కాదని తెలుస్తుంది.. తెలుగు సినిమా పరిశ్రమకి పునాది వేసిన ఈయన ఎన్నో చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడని తెలుస్తుంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి అటు సినీ పరిశ్రమ లోనూ అలాగే ఇటు సామాజిక సేవలో కూడా ఎంతోమందికి స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారని తెలుస్తుంది.ఇకపోతే చిరంజీవి నటించిన సినిమా శివుడు శివుడు శివుడు. ప్రముఖ దర్శకుడు అయిన కోదండరామి రెడ్డి డైరెక్టర్ గా తెరకెక్కించారు అని అందరూ చెబుతూ వుంటారు.. కానీ నిజానికి కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించలేదని సమాచారం. ఇందుకు గల కారణం ఏమిటి అంటే  ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు మొదటి షాట్ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన విషయం అందరికి తెలిసిందే. అదే సమయంలో ప్రముఖ సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావుతో శ్రీరంగనీతులు సినిమా కి కూడా దర్శకత్వం వహిస్తున్నారట కోదండరామిరెడ్డి.

 

చిరంజీవి తో శివుడు శివుడు శివుడు సినిమా షూటింగ్ మొదటిరోజు ఊటీ లో జరుపుకుందని సమాచారం. ఈ సినిమాని శ్రీ క్రాంతి చిత్ర పతాకంపై క్రాంతికుమార్ నిర్మించారని తెలుస్తుంది.అప్పుడు కోదండరామి రెడ్డి కి నాగేశ్వరరావు ఫోన్ చేసి, వెంటనే హైదరాబాద్ కు రమ్మని చెప్పారని సమాచారం.ఒక పక్క చిరంజీవి మరోపక్క అక్కినేని నాగేశ్వరావు గారు. అస్సలు ఎటు వెళ్లాలో అర్థం కాక సీనియర్ నటుడు నాగేశ్వరరావు కాబట్టి చిరంజీవి ని కాదని ఏఎన్నార్ వైపు వెళ్ళాడట దర్శకుడు కోదండరామిరెడ్డి. ఇందుకు మరొక ముఖ్య కారణం కూడా ఒకటి ఉందని సమాచారం.అదేమిటంటే ఏఎన్ఆర్ స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ కు కోదండరామిరెడ్డి ఎక్కువ డేట్స్ ఇచ్చారని సమాచారం..

అయితే చిరంజీవి సినిమాకు మొదటి రోజే ఇలా కావడంతో చేసేదేమీలేక జనవరి 15 నుంచి క్రాంతి కుమార్ డైరెక్ట్ చేయడం జరిగిందని సమాచారం. 1993 లో విడుదలైన ఈ చిత్రం పరాజయంగా మిగిలిందని సమాచారం. కానీ ఈ సినిమా టైటిల్స్ అలాగే పోస్టర్స్ లో కోదండరామి రెడ్డి పేరునే వేశారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: