ఆ విధంగా మెగాస్టార్ చిరంజీవి తరువాత నెంబర్ వన్ స్థానానికి ప్రస్తుతం ఎంతో దగ్గరగా ఉన్న ఈ ఇద్దరి గురించి తెలుసుకోవాలని వారి అభిమానులు సైతం ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. తొలిసినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుండి మొన్నటి వకీల్ సాబ్ వరకు పవన్ కెరీర్ లో ఎన్నో భారీ విజయాలు అందుకున్నప్పటికీ పవన్ యాటిట్యూడ్ లో కొంచెం కూడా మార్పు రాలేదని, అలానే ఎంతో ఒదిగి ఉంటారని చెప్తుంటారు ఆయన సన్నిహితలు.
ఇక తండ్రి వారసుడిగా రాజకుమారుడు మూవీ తో హీరోగా లాంఛ్ అయిన సూపర్ స్టార్ మహేష్ కూడా మొన్నటి సరిలేరు నీకెవ్వరు వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలతో స్టార్ స్టేటస్ సంపాదించినప్పటికీ అందరితో కలిసి మెలిసి ఉండడంతో పాటు ఎంతో సదా సీదాగా వ్యవహరిస్తూ ఉంటారని పలువురు సినిమా ప్రముఖులు చెప్తుంటారు. అయితే ఈ ఇద్దరు స్టార్ నటుల మధ్య ఒక విషయమై ఒకింత సారూప్యత ఉందని అంటున్నారు. ఈ ఇద్దరూ కూడా తమకు తీరిక సమయం దొరికితే ఎక్కువగా పుస్తకాలు చదవడానికి ఇష్టపడతారని, అలానే ఇద్దరికీ కూడా పార్టీ కల్చర్ అస్సలు నచ్చదని సమాచారం. మరి అంత పెద్ద స్టార్స్ ఊరికే అయిపోరుగా, ఇంత మంచి అలవాట్లు ఉండబట్టే వారిద్దరికీ అంత గొప్ప పేరు వచ్చిందని అంటున్నారు పలువురు ఆడియన్స్.