తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ అనగానే పరభాష నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటారు మన దర్శక నిర్మాతలు. హీరోలు సైతం ముంబై నుంచి వచ్చే హీరోయిన్ లను తమ సినిమాలలో కథానాయికగా పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. తెలుగు అమ్మాయి హీరోయిన్ అనగానే ఎవరూ పెద్దగా ఆసక్తి చూపరు అయితే ఇక్కడే ఓ సమస్య ఉంది. ముంబై నుంచి వచ్చే అమ్మాయిలు గ్లామర్ షో చేయడానికి కొన్ని అభ్యంతరకర సీన్లు చేయడానికి ఏ మాత్రం అడ్డు చెప్పరు. దాంతో ఏ రిస్క్ లేకుండా మన దర్శక నిర్మాతలు వారికే హీరోయిన్ ఛాన్సులు ఇస్తూ ఉంటారు.

తెలుగు అమ్మాయిలు అయితే కొంత అభ్యంతరం చెబుతారు. అంతేకాకుండా తెలుగు హీరోయిన్ లు కొంత ఇబ్బంది పెడతారనే అపవాదు కూడా ఉంది. దీనికి తోడు ప్రేక్షకులు కూడా హీరోయిన్ ల నుంచి భారీ గ్లామర్ ను, ఎక్స్ పోజింగ్ ను ఎక్స్ పెక్ట్ చేయడంతో ఈ విధంగా దర్శక నిర్మాతలు ఆలోచించడం మొదలు పెడుతున్నారు. అయితే తెలుగు హీరోయిన్ వారి రేంజ్ లో గ్లామర్ షో చేయరా అంటే గతంలో చేయడానికి వెనుకాడేవారు అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మన తెలుగు హీరోయిన్ లు కూడా ముంబై భామల రేంజ్ లో గ్లామర్ షో లతో రెచ్చి పోతున్నారు.

ఇటీవలి కాలంలో కొంతమంది తెలుగు హీరోయిన్ లు కొన్ని సినిమాలలో నటించి తమ అందాల ప్రతాపాన్ని ప్రేక్షకులపై చూపించారు. టాక్సీవాలా చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన ప్రియాంక జవాల్కర్ కొన్ని ఫోటో షూట్ లతో కుర్రకారుని పిచ్చెక్కించగా ఆమె లాగానే మరొక తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి కూడా ప్రేక్షకులను తన అందాలతో మత్తెక్కించింది. అంతే కాకుండా ఇంకొంతమంది కూడా సినిమా లలో అందాల ప్రదర్శనకు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో మన దర్శక నిర్మాతలు తెలుగు హీరోయిన పై వైపు చూస్తారు అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: