1981 నవంబర్ 7వ తేదీన మంగళూరులో జన్మించింది అనుష్క. ఇక ఈమె భాష తుళు.. ఇంట్లో అందరూ స్వీటీ అని పిలుస్తారు. ఇక ఈమె ఉన్నత విద్యాభ్యాసం డిగ్రీ వరకు మంగుళూరులోనే కొనసాగింది. నిజానికి అనుష్క కుటుంబంలో అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు కావడం చేత ఆమె కూడా డాక్టర్ కావాలని నిర్ణయించుకుందట. కానీ అనుష్క తండ్రి.." వద్దు స్వీటీ ..డాక్టర్ కోర్స్ చదవాలంటే నిరంతరం చదువుతూనే ఉండాలి ..మీ కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది.. సంతోషాన్ని కోల్పోతారు" అని చెప్పాడట. దాంతో బైపీసీ వదిలేసి కంప్యూటర్ కోర్సులో చేరింది. కొద్ది రోజులు చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్పడం, ఆ తర్వాత యోగా టీచర్ గా మారడం కూడా జరిగింది.

అయితే అప్పుడప్పుడు భరత్ ఠాగూర్ దగ్గర సినీ ఫీల్డ్  అంటే ఇష్టం అని చెబుతూ వుండేది. భరత్ ఠాగూర్ కు.. మెహర్ రమేష్ పరిచయస్తుడు. మెహర్ రమేష్ కు భరత్ ఠాగూర్ అనుష్క గురించి చెప్పడంతో..అక్కడ  మెహర్ రమేష్ సరేనని చెప్పి హైదరాబాద్ వచ్చేసిన తర్వాత, పూరి జగన్నాథ్ సూపర్ సినిమా కోసం సెకండ్ హీరోయిన్ ను వెతుకుతున్నారని తెలిసి, మెహర్ రమేష్, పూరి జగన్నాథ్ కు చెప్పారు. పూరి జగన్నాథ్ ..భరత్ ఠాగూర్ కి ఫోన్ చేసి అనుష్క ను బొంబాయి వచ్చి కలవడం జరిగింది. ఆడిషన్స్ కిన్ రమ్మని చెప్తే ఒక రోజు కంటే ముందే అనుష్క హాజర్ అయిందట.

ఇక మరి కొద్ది రోజుల తర్వాత పూరి జగన్నాథ్ ఫోన్ చేసి అనుష్కతో సెలెక్ట్ అయ్యావు అగ్రిమెంట్లో స్వీటీ కాకుండా మరేదైనా పేరు పెట్టుకో అని చెబితే, తన నాన్నకి ఫోన్ చేసి ఏదైనా ఒక మంచి పేరు చెప్పమని అడిగిందట. అప్పుడు వాళ్ల నాన్న .. నీ పేరు మార్చు కునే అవకాశం నీకే వచ్చింది కాబట్టి , నువ్వే ఏదైనా మంచి పేరు నిర్ణయించుకో అమ్మా అని చెప్పడంతో ఆమె అనుష్క అని పేరు మార్చుకుంది. స్వీటీ శెట్టి కాస్త అనుష్క శెట్టి గా మారి ఆ తర్వాత సూపర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది అనుష్క..

ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో, స్టార్ హీరోల సినిమాల్లో దాదాపు కొన్ని పడుల సంఖ్యలో సినిమాలలో నటించి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: