తెలుగు తమిళ భాషలలో వందకు పైగా సినిమాలు చేసి మూడు దక్షిణ ఫిలింఫేర్ అవార్డులు అందుకుని సెన్సేషనల్ హీరోయిన్ గా దశాబ్దాలపాటు ఆమె కథానాయికగా కొనసాగింది. మిస్ చెన్నై అందాల పోటీలలో ఎంపికైన తర్వా త మిస్ ఇండియా పోటీ లో పాల్గొని బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికయింది. 1983 లో జన్మించిన ఈమె తెలుగులో నీ మనసు నాకు తెలుసు అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. ఆమె భారీ హిట్లు సొంతం చేసుకోవడంతో స్టార్ హీరోయిన్ గా అతి తక్కువ సమయంలోనే ఎదిగింది.

 వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ లు సంపాదించి ఈమె హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. ఆ తరువాత పెద్ద హీరోలు సైతం తమ సినిమాలలో పెట్టుకోవడానికి ఎగబడ్డా రు. దానికి తోడు ఆ సినిమాలు కూడా సూపర్ హిట్ కావడంతో ఈమెకు పెద్ద అవకాశాలు వచ్చాయి.  ఇక తెలుగులో ఇతర హీరోయిన్ లు వస్తున్న కొద్దీ త్రిష కు ప్రాముఖ్యత తగ్గింది. సెకండ్ గ్రేడ్ హీరోలతో సినిమాలు చేయడం మొదలు పెట్టింది. ఆ తర్వాత లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. మెల్ల మెల్ల గా తెలుగులో అవకాశాలు రాకుండా పోయాయి.

అయితే తమిళంలో మాత్రం ఇప్పటికీ ఆమె పలు చిత్రాలతో దూసుకుపోతుంది. పెద్ద పెద్ద సినిమాల్లో సైతం అవకాశాలు దక్కించుకుంటుంది. అయి తే అవి హీరోయిన్ పాత్రలు కాకపోవడం గమనా ర్హం. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ప్రత్యేక పాత్రలు వంటివి చేస్తూ త్రిష తన కెరీర్ను నెట్టుకొస్తుంది ప్రస్తుతం. తెలుగులో కూడా సీనియర్ హీరోల సరసన అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోది. ఈ నేపథ్యంలో త్రిష ఇప్పుడు చేసే సినిమాలతోనైనా మళ్లీ కం బ్యాక్ చేస్తుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: