తెలుగు సినిమా లో ఇప్పుడు ఎక్కువగా కష్టాలు మనం చూస్తున్నాం తెలుగు సినిమా పరిశ్రమలో చాలామంది సినిమాలు చేయడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది అనే మాట వాస్తవం. టాలీవుడ్లో చాలా మంది దర్శక నిర్మాతలు సినిమాలు చేసేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది అనే మాట వాస్తవం ఈ క్రమంలో కొంతమంది దర్శక నిర్మాతలు సినిమాలు నువ్వు కూడా వదులుకునే పరిస్థితి తలెత్తింది. అగ్ర హీరోలతో సినిమాలు చేయడానికి కూడా చాలా మంది స్టార్లు దర్శక నిర్మాతలు ముందుకు రాకపోవడంతో టాలీవుడ్ కష్టాల్లో పడింది అనే మాట వాస్తవం. 

ఇప్పుడు కొంత మంది స్టార్ హీరోలు కూడా నిర్మాతగా మారడానికి ఆసక్తి చూపించడం లేదు అని సమాచారం ఇటీవలి కాలంలో సినిమాలకు పెద్దగా ఆశించిన ఫలితాలు రాకపోవడం సినిమా కథల్లో కూడా పెద్దగా లేకపోవడం కొంత మంది దర్శకులు అనుకున్న స్థాయిలో రాణించలేక పోవడంతో చాలావరకు స్టార్ హీరోలు నిర్మాతలుగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదని ఫిల్మ్ నగర్ వర్గాలు కోడై కూస్తున్నాయి. పెద్ద పెద్ద హీరోలు కూడా ఈ మధ్యకాలంలో పెట్టుబడులు పెట్టకపోవడంతో చాలా వరకు కూడా ఆందోళన మొదలవుతుంది.

 నిర్మాతలకు పెద్ద హీరోలు కాస్త అండగా నిలబడేవారు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవడం నిర్మాతలు మాత్రమే పెట్టుబడులు పెట్టాలని పోవడంతో భారీ సినిమాలు చేయాలనుకునే వారికి కాస్త కంగారు మొదలైంది అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. భవిష్యత్తులో ఇదే విధంగా పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని కాబట్టి టాలీవుడ్ విషయంలో కొంత వరకు ప్రభుత్వాలు కూడా సహకరించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు దీనిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు అనేది సినిమా పరిశ్రమ పెద్దలు తీసుకునే నిర్ణయాల మీద కూడా ఆధారపడి ఉంటుందని టాలీవుడ్ జనాలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: