ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న కొంతమంది హీరోలు స్టార్ హీరోయిన్ల విషయంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనే మాటలు మనం ఎక్కువగా వింటున్నాం ప్రధానంగా పూజా హెగ్డే ,రష్మిక మందన లాంటి వాళ్ల విషయంలో టాలీవుడ్ లో చాలా ఆసక్తి చూపిస్తుంది అని వాళ్ళను సినిమాల్లోకి తీసుకుని భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఈ మధ్యకాలంలో ప్రచారం మొదలైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తే హీరోయిన్లకు భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చే పరిస్థితి లేదు స్టార్ హీరోలకు కూడా రెమ్యూనరేషన్ తగ్గించి ఇచ్చే పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం .

దీంతో ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో చాలా జాగ్రత్తలు పడుతున్నారని కొంతమంది హీరోలు రెమ్యునరేషన్ని తగ్గించుకోవడమే కాకుండా నిర్మాతలకు వచ్చే లాభాల్లో వాటాలు తగ్గించుకున్నారు అని ఈ మధ్య కాలం లో ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం కొంతమంది హీరోయిన్లు చాలా వరకు జాగ్రత్తగానే సినిమాలు చేస్తున్నా సరే ఎక్కువగా డిమాండ్ చేయడం అలాగే ఇతర భాషల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి తెలుగులో చేసే సినిమాలకు కొంత వరకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ప్రధాన సమస్య అయిపోయింది అందులో ప్రధానంగా రష్మిక మందన.

 ఇతర భాషల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి తెలుగులో చేసే సినిమాలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొంతమంది దర్శక నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .ఇదే వైఖరి భవిష్యత్తులో కూడా కొనసాగితే సమస్యలు ఉంటాయని రష్మిక మందనకు కొంత మంది హీరోలు కూడా హెచ్చరించారని కృష్ణా నగర్ వర్గాల మాట. అందుకే రష్మిక మందన రెమ్యూనరేషన్ భారీగా తగ్గించే అవకాశం ఉందని త్వరలోనే రష్మిక మందన విషయంలో స్టార్ దర్శక నిర్మాతలు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండవచ్చని అంటున్నారు. మరి ఇది ఎలా ముందుకు వెళ్తుందో చూద్దాం.మరి దీనిపై ముందు ముందు రష్మిక ఎలా నడుచుకుంటుదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: