సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో హత్యాచారం కి గురైన చిన్నారి కుటుంబ సభ్యులను టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ ప‌రామ‌ర్శించారు. ఈ సంధ‌ర్బంగా మంచు మ‌నోజ్ ఎమోష‌న‌ల్ అయ్యారు. మ‌నోజ్ మాట్లాడుతూ...చిన్నారికి జరిగింది క్రూరత్వమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌నపై మనందరం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని మంచు మ‌నోజ్ పిలుపునిచ్చారు. ఆడపిల్లలను ఎలా గౌరవించాలో అందరికీ త‌ల్లి దండ్రులు నేర్పించాల‌ని మ‌నోజ్ అన్నారు. ఇంకా నిందితుడు దొరకలేదని పోలీసులు అంటున్నారు..
ప్రభుత్వం, పోలీసులు దీనిని సీరియస్ గా తీసుకోవాలని మంచు మ‌నోజ్ డిమాండ్ చేశారు. చత్తీస్ఘడ్ లో మూడేళ్ళ క్రితం చిన్నారిపై జరిగిన హత్యాచారం జ‌రిగితే ఆ కేసులో ఉరిశిక్ష వేయాలని ఇప్పుడు తీర్పు వచ్చిందని మంచు మ‌నోజ్ వ్యాఖ్యానించారు.


24 గంటలలో పట్టుకుని వెంట‌నే కఠినంగా శిక్షించాలని మ‌నోజ్ డిమాండ్ చేశారు. అంతే కాంకుండా ఈ సంధ‌ర్బంగా మీడియా పై కూడా మంచు మ‌నోజ్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. టీవీ చానళ్లలో సాయి ధరమ్ తేజ్ గురించి యనిమేషన్లు వేయకుండా... ఇలాంటి వాళ్లకు న్యాయం జరిగేలా చూడాలంటూ మ‌నోజ్ మీడియాకు స‌లహా ఇచ్చారు. అంతే కాకుండా చిన్నారి కుటుంబానికి అండ‌గా ఉంటామంటూ మ‌నోజ్ హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా సౌదాబాద్ లో ఐదేళ్ల చిన్నారి చైత్ర పై జ‌రిగిన దారుణం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. అప్ప‌టి వ‌ర‌కూ ఇంటి ముందు ఆడుకున్న చిన్నారిని ఇంటి ప‌క్క‌న ఉన్న యువ‌కుడు చాక్లెట్ ఆశ చూపి హ‌త్యాచారం చేయ‌డం ఆ కుంటుంబాన్ని కోలుకోని బాధ‌లోకి నెట్టేసింది. ఈ ఘ‌ట‌నపై సినీ తారలు..పొలిటిక‌ల్ లీడ‌ర్ లు స్పందిస్తున్నారు. నిన్న బాధిత కుటుంబాన్ని సీత‌క్క ప‌రామ‌ర్శించి వెంంట‌నే నిందితుడికి ఉరివేయాల‌ని డిమాండ్ చేయ‌గా..ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ఈ కేసును స‌జ్జ‌న్నార్ కు అప్ప‌గించాలంటూ కేటీఆర్ ను సోష‌ల్ మీడియా ద్వారా కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: