టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక విషయం మీద బాగా మోజు పెంచుకుంటున్నారు. దాంతో వారు భారీ రిస్క్ నే ఫేస్ చేస్తున్నారు అంటున్నారు. తాము వెళ్తున్న రూట్ ని సడెన్ గా మార్చేసి సరికొత్త దిశగా అడుగులు వేస్తున్నారు.

అయితే ఈ రూట్ చేంజ్ చేస్తున్నపుడు వారికి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇంతకీ వారు ఎందుకు రూట్ మారుస్తున్నారు అంటే క్లాస్ హీరోలుగా ముద్ర పడిపోవడం కొందరికి అసలు ఇష్టం లేదు. మరి కొందరికీ లవర్ బాయ్ ఇమేజ్ మోయలేని భారంగా ఉంది. ఇంకొందరికి చాక్లెట్ బాయ్ పేరు ఎబ్బెట్టుగా ఉందిట. దాంతో వారంతా ఊర మాస్ గా కనిపించాలని ఉబలాటపడుతున్నారు. మాస్ హీరోలకే ఎక్కువ కాలం కెరీర్ ఉంటుంది. దాంతో పాటు ఒక హిట్ సరైంది పడింది అంటే దాని ఇంపాక్ట్ కూడా గట్టిగా ఉంటుంది.

మరి ఈ సీక్రెట్ తెలిసిన హీరోలు ఊరుకుంటారా. అర్జంట్ గా తాము మాస్ ఇమేజ్ ని సాధించాలని చేయని ప్రయత్నం లేదు. దీంతో వారి ప్రయత్నం కూడా ఒక్కోసారి విఫలం అవుతోంది. ముందుగా నాచురల్ స్టార్ నాని గురించి చెప్పుకోవాలనుకుంటే ఆయన క్లాస్ హీరోగా ఉంటూనే హిట్లు కొట్టారు. ఎపుడైతే క్రిష్ణార్జున యుద్ధం అంటూ మాస్ కి ట్రై చేశారో అది ఫ్లాప్ అయింది. ఇక మొన్న రిలీజ్ అయిన టక్ జగదీష్ కూడా ఫట్ అయింది. అయినా సరే మరిన్ని సినిమాలు అదే రూట్లో వదలడానికి నాని రెడీగా ఉన్నాడు.

ఇక నితిన్ కూడా మాస్ అంటూ కలవరిస్తున్నాడు. నితిన్ చెక్ సినిమా చేస్తే ఫ్లాప్ అయింది. అయినా సరే మాచర్ల నియోజకవర్గం అంటూ పక్కా మాస్ మూవీని రీసెంట్ గా అనౌన్స్ చేశాడు. శర్వానంద్ కూడా మాస్ అంటూ పరుగులు పెడుతున్నాడు. అక్కినేని వారి హీరో అఖిల్ ఏజెంట్ పక్కా మాస్ అని పోస్టర్ చెబుతోంది. వీరే కాదు చాలా మంది యంగ్ హీరోలు తాము మాస్ ఇమేజ్ సాధించాలని గట్టిగానే డిసైడ్ అయ్యారు. అయితే మాస్ ఇమేజ్ రావడం అంత ఈజీ కాదు, ఒకసారి వస్తే మాత్రం ఇక అది అతుక్కుపోయి కెరీర్ మొత్తం కంటిన్యూ అవుతుంది. చూడాలి మరి వీరిలో ఎందరు మాస్ రాజాలు అవుతారో.


మరింత సమాచారం తెలుసుకోండి: