2006 లో విడుదలైన మాస్ మహారాజా రవితేజ యాక్షన్ చిత్రం "విక్రమార్కుడు"కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి, ఈ చిత్రం అన్ని రీమేక్ వెర్షన్‌ల గురించి తెలుసుకుందాం.

'విక్రమార్కుడు' 23 జూన్ 2006 న విడుదలైంది. ఈ సినిమాకి దర్శకత్వం వహించినది సుప్రసిద్ధ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇందులో రవితేజకు జోడిగా అనుష్క శెట్టి కనిపించింది .

రాజమౌళి కి మరో కమర్షియల్ మైలురాయి 'విక్రమార్కుడు'. రవితేజ నటించిన డ్యూయెల్ రోల్ స్టోరీ లో ఒకరు సత్తి బాబు అనే దొంగ, మరొకరు విక్రమ్ సింగ్ రాథోడ్ అనే డేర్ డెవిల్ పోలీసు. అవినీతిపరుడైన రాజకీయ నాయకుడి చేతిలో హత్యకు గురైన పాప తండ్రికి న్యాయం జరగాలని పోలీసుగా మారిన దొంగ ఎలా పోరాడతాడు అనేది కథ. 'విక్రమార్కుడు' తరువాత తమిళంలో 'సిరుతై', హిందీలో అక్షయ్ కుమార్ నటించిన 'రౌడీ రాథోర్' గా రీమేక్ అయ్యింది.

ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేశాడు. ఆయన కెరీర్‌లో డ్యూయల్ రోల్‌ లో కనిపించిన మొదటి సినిమా ఇదే. అంతేకాదు రవితేజ తో అనుష్క శెట్టికి కూడా ఇదే మొదటి సినిమా.

ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. అంతేకాదు IMDB లో ఏకంగా 7.7/10 అద్భుతమైన రేటింగ్ సాధించింది.ఇప్పటికి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ . అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.25 కోట్లు సంపాదించింది.

బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించిన తరువాత ఈ చిత్రం ఇప్పటివరకు 3 భాషలలోకి డబ్ చేయబడింది. మలయాళం చిత్రం భాషలో విక్రమాథిత్య , హిందీలో విక్రమ్ సింగ్ రాథోడ్, భోజ్‌పురిలోకి, బెంగాలీ భాషల్లోకి సైతం ఈ సినిమాను డబ్ చేశారు. అన్నిచోట్లా హిట్టే. రాజమౌళి మార్క్ అలా అన్ని భాషల వారికీ నచ్చిందన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: