తెలుగు భాషలో ని తీయదనాన్ని సంభాషణ ద్వారా నే వ్యక్తం చేయగలరు. తెలుగు మాట్లాడే అందరూ ఒకటే ఐన వారి వారి ప్రాంతాలను బట్టి యాస మారిపోతుంది.  తెలంగాణ యాస,రాయలసీమ యాస,  ఆంధ్రాలో ఇంకో రకమైన యాస ఎలా రకరకాల యాసలు ఉన్నాయి. ప్రతి ఒక్క యాస ప్రత్యేకమైనది. తెలంగాణ యాసలో ఒక డిఫరెంట్ ఫీల్ మరియు యూనిక్ నెస్ ఉంటుంది.దాని వైబ్ ఏ వేరు.ఈ తెలంగాణ యాస వాడుతూ తమకంటూ ఒక క్రేజ్ ని తెచ్చుకున్నారు కొందరు సినీ తారలు. ఒక ఫీల్ తో, పర్ఫెక్ట్  పిచ్ మరియు టోన్ తో, డైలాగ్  డెలివరీ చేసి, కొన్ని క్యాచీ మరియు యూనిక్ పదాలు వాడుతూ జనాల కి  వారి డైలాగ్స్  బాగా అలవాటు చేసేసారు.మరి మన సినీ తారలు తెలంగాణ యాసతో మన మనసులు దోచేసిన సినిమాల వైపు ఒక కన్ను వేదమా...

ఫిదా:సాయి పల్లవి  
ఫిదా సినిమా లో నటనతోనే కాకుండా తన డైలాగ్స్ తో ఎందరినో తనవైపు ఆకర్షించుకున్న నటి సాయి పల్లవి. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు వారి హృదయాలలో సంపాదించుకుంది. ఫిదా సినిమా తో ఎంతోమంది తనకు ఫిదా అయిపోయారు.

జాతి రత్నాలు: నవీన్ పోలిశెట్టి
జాతి రత్నాలు సినిమా గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్ గా  రిలీజ్ అయిన ఈ సినిమా అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరి మనసును దోచుకుంది.
సినిమా లో డైలాగ్స్ అయితే క్రేజీ, డైలాగ్ డెలివరీ, [పాటలు  కాన్సెప్ట్ అన్ని సూపర్. ఇంట్లో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ కలిసి చేసుకునే కామెడీ మూవీ తనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ ని సంపాదించుకుంది.

ఇస్మార్ట్ శంకర్: రామ్ పోతినేని
రామ్ అంటే అందరికీ చాక్లెట్ బాయ్, గానే తెలుసు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తో మాస్ లుక్ ని ఫాన్స్ కి అందిస్తూ తెలంగాణ యాసలో డైలాగ్స్ అదరగొట్టేశాడు.

అర్జున్ రెడ్డి & పెళ్లిచూపులు : విజయ్ దేవరకొండ
సినిమాల్లోనే కాకుండా బయట కూడా వి.డి  తెలంగాణ యాసతో ఒక స్వాగ లాగా దూసుకెళుతూ ఉండడం. మనం చూస్తూనే ఉంటాం

మరింత సమాచారం తెలుసుకోండి: